వైరల్: వ్యాక్సిన్ తీసుకున్న క్యాన్సర్ పేషెంట్ లలో యాంటీబాడీలు వృద్ధి..!

Divya
కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. కానీ వ్యాక్సిన్ తీసుకుంటున్న వారిలో ఎంతవరకు యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయి.. అనే విషయంపై పరిశోధకులు చాలా అధ్యయనాలు చేశారు.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు.. అలాగే బాలికల నుంచి గర్భిణీ స్త్రీల వరకు.. అంతేకాదు సుదీర్ఘ వ్యాధులు ఉన్న రోగుల పై కూడా అధ్యయనాలు చేశారు.. ఇకపోతే ఇప్పటివరకు క్యాన్సర్ పేషెంట్ లపై కరోనా వ్యాక్సిన్ ఎలా పనిచేస్తోంది..? అనే విషయంపై ఎటువంటి అధ్యయనాలు జరగలేదు.
ఇప్పుడు ఆ అధ్యయనం కూడా జరిగి.. అతిపెద్ద శుభవార్త తెలిపారు పరిశోధకులు.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న  క్యాన్సర్ పేషెంట్ లలో కూడా వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా పని చేస్తోంది అని, ఆంటీ బాడీ లు చాలా అద్భుతంగా ఉత్పత్తి అవుతున్నాయి అని కూడా సైంటిస్టులు తెలిపారు.. ఇకపోతే తాజాగా 791 మంది క్యాన్సర్ పేషెంట్ లపై సైంటిస్టులు నెదర్లాండ్స్ లో జరిపిన పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే, క్యాన్సర్ పేషెంట్ లపై అత్యంత ప్రభావవంతంగా వ్యాక్సిన్ పని చేస్తోంది అని తేల్చారు.. క్యాన్సర్ నివారించే కీమోథెరపీతో పాటు ఇమ్యూనో థెరపీ  పై కూడా ప్రభావం ఎలా ఉంది.. అనే అంశంపై అధ్యయనం చేయగా సానుకూల  అంశాలు వెల్లడయ్యాయి.
ఈ పరిశోధనలో వెల్లడైన విషయం ఏమిటంటే , గతంలో క్యాన్సర్ పేషెంట్ లపై క్లినికల్ ట్రయల్స్ జరగలేదు.. వీరిలో చికిత్స వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా చాలా బలహీనంగా ఉంటుందన్న నేపథ్యంలో,  వీరిపై ఎటువంటి పరిశోధనలు జరగలేదు.. కానీ  క్యాన్సర్ చికిత్స కోసం చేయించుకున్న కీమోథెరపీ , ఇమ్యూనో థెరపీ వంటి చికిత్సల చేయించుకున్న  వారిపై అధ్యయనం జరపగా, వారిపై యాంటీబాడీలు ఎలా డెవలప్ అవుతున్నాయి అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకలేదు.. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్స్ లో  క్యాన్సర్ పేషెంట్ లపై పరిశోధనలు చేయడంతో క్యాన్సర్ పేషెంట్ల పై కరోనా వ్యాక్సిన్ అత్యంత సానుకూలంగా పని చేస్తోంది అని వారు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: