బుల్లెట్ బండి పాట.. స్టెప్పులేసిన డిప్యూటీ సీఎం సతీమణి?

praveen
బుల్లెట్ బండి పాట..  ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తోంది.  పిల్లల నుంచి పెద్దల వరకు కూడా బుల్లెట్ బండి పాట వచ్చిందంటే చాలు ఉర్రూతలూగి పోతున్నారు. అంతే కాదు అందరూ స్టెప్పులు వేస్తూ అదరగొడుతున్నారు.  ఇలా ప్రస్తుతం బుల్లెట్ బండి పాట ఎక్కడ చూసినా వినిపిస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కూడా..  ఈ బుల్లెట్ బండి పాటకు డాన్సు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఒక పెళ్లికూతురు బుల్లెట్ బండి పాట పై డాన్స్ చేస్తూ ఏకంగా వరుడికి సర్ప్రైజ్ ఇవ్వడంతో ఈ పాట ఎంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత ఎంతో మంది ఈ పాట పై డాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 ప్రస్తుతం ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఈ బుల్లెట్ బండి పాటే ఎక్కువగా వినిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పాట పైన డ్యాన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సామాన్యుడు సినీ సెలబ్రిటీలు బుల్లెట్ బండి పాట పై డాన్స్ చేయడం కామన్.  కానీ రాజకీయ నాయకులు వారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇలాంటి పాటలఫై డాన్సులు చేస్తే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఓ కార్యక్రమంలో బుల్లెట్ బండి పాటపై డాన్స్ చేసిన వీడియో కాస్తా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇపుడు ఇటీవలే డిప్యూటీ సీఎం సతీమణి బుల్లెట్ బండి పాటకి డాన్స్ చేశారు.

 దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇలా మొన్నటివరకు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఊపేసిన బుల్లెట్ బండి పాట ఇక ఇప్పుడు నాయకుల ఇళ్లల్లో కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి సతీమణి ఇటీవలే బుల్లెట్ బండి పాటకు తనదైన శైలిలో స్టెప్పులు వేశారు. ఏకంగా తన భర్త యెదుట ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ఆమె ఎంతగానో ఆనంద పడిపోయారు. ఇక ఈ దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: