వైరల్ : ఎస్కలేటర్ మీద వెళ్తున్న మహిళను తన్నిన వ్యక్తి..చివరకు..?
తాజాగా అమెరికాలోని బ్రూక్లిన్ అనే ప్రాంతం లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఎస్కలేటర్ మీద వెళ్తున్న ఒక మహిళను ఓ వ్యక్తి వెనక్కి తిరిగి అత్యంత దారుణంగా ఆ మహిళలు కాలితో తన్నాడు.దీంతో ఆమె సడన్ గా భయపడి పోయి పట్టుకోవడానికి కూడా సపోర్ట్ లేక కాలుజారి కింద పడిపోయింది. ఇక ప్రస్తుతం ఈ సీసీ టీవీఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. ఆ నిందితుడి కోసం పోలీసులు తెగ గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఎస్కలేటర్ అమెరికాలోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ దగ్గరలో ఉన్న బ్రూక్లిన్‌లో వున్న అట్లాంటిక్ ఎవ్-బార్‌క్లేస్ సెంటర్ స్టేషన్‌లో ఒక మహిళ (32), ఓ వ్యక్తి ఎస్కలేటర్ మీద పై అంతస్తుకు వెళ్తున్నారు. ఆ సదరు వ్యక్తి ఆ మహిళ కన్నా కొన్ని మెట్లు మీదకు వేగంగా పైకి వచ్చాడు.. అయితే సడెన్ గా అతను వెనక్కి తిరిగి ఆమెను కాలితో తన్నాడు. దీంతో ఆమె ఎస్కలేటర్ నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది.
ఇకపోతే ఆ మహిళకు కాళ్లు, చేతులు, వెన్నెముకకు గాయాలు కాగా.. ఆమెకు చికిత్స అందించడంబ్కోసం పోలీసులు ప్రయత్నించారు. కానీ చిన్న గాయాలు అయ్యాయని, తనకు ఎలాంటి చికిత్స అవసరం లేదని ఆ మహిళ చెప్పింది. అయితే పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.