బంగారు జుట్టు మీరు ఎప్పుడైనా చూసారా..?

MOHAN BABU
బట్టతల సమస్య ఉంటే విగ్గులు వాడడం లేదా హెయిర్ ట్రాన్సఫ్లాంటేషన్ చేసుకోవడం సాధారణ విషయమే. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఫిల్మ్ స్టార్లు ఈ పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అయితే అందరిలా హెయిర్ ట్రాన్సఫ్లాంటేషన్ చేసుకుంటే కిక్ ఏముంటుందని భావించిన ఓ ర్యాపర్. సర్జరీ ద్వారా తన నెత్తిపై గోల్డ్ చైన్ ను ఇంప్లాంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే లుక్ లో తన న్యూ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేయగా.. ఆన్లైన్ లో సీరియస్ చర్చకు కారణమైంది. కొంతమంది డాక్టర్లు ర్యాపర్ చర్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాపర్ డాన్ సూర్ జేమ్స్.. డైమండ్స్ తో అలంకరించబడిన గోల్డ్ చైన్ న్యూ మెటాలిక్ లాక్స్ ను చూపిస్తూ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టిక్ టాక్ వీడియో ఆన్లైన్ లో సంచలనం సృష్టించింది.

 హ్యూమన్ హిస్టరీ  లో శస్త్రచికిత్స ద్వారా బంగారు గొలుసులను వెంట్రుకలుగా నెత్తిపై అమర్చుకున్న ఫస్ట్ ర్యాపర్ గా  ఈ  23 ఏళ్ల మ్యూజిషియన్ రికార్డ్ సృష్టించాడు. గత ఏప్రిల్ లోనే ఈ సర్జరీ జరిగినట్లు తెలుస్తుండగా ఇందుకు ఎంత ఖర్చుఅయ్యిందనే సమాచారం లేదు. న్యూ సాంగ్' ఓరో రిలీజ్ తర్వాతే డాన్ కొత్త రూపం బయటపడింది. అంతేకాదు అతని పల్ల పైన గోల్డెన్ కోటింగ్ ఉండడం విశేషం. అయితే ఈ విషయంపై స్పందించిన డాన్.. చాలామంది తమ జుట్టుకు రంగు వేసుకోవడాన్ని చూస్తూంటా.

 వారందరికంటే నేను భిన్నంగా కనిపించాలనుకొని గోల్డ్ చైన్ ఇంప్లాంట్ చేయించుకున్నా. ఇప్పుడు నన్ను ఎవరూ కాపీ కొట్టలేరు అని వెల్లడించాడు.. కదా చాలా మంది ఆ చైన్లు నిజమైనవేనా..? పళ్ళ మీద గోల్డ్ ఉంటే అతను పళ్ళు ఎలా తోముకుంటాడు..?  అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి చర్యలను ఇతరులు కాపీ కొట్టే ప్రమాదముందని. డాన్ తన చేసిన పనితో ఇతరులను ప్రేరేపించగలడని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల బాడీకి చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: