
వైరల్ : మాస్క్ వేసుకోలేదని ఆర్మీ జవాన్ ను చితకబాదారు?
అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అటు పోలీసులు మాత్రం మాస్కు పెట్టుకోకుండా భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపట్ల ఎంతో కఠినంగానే ఉంటున్న ఘటనలు తారసపడుతున్నాయి. కొంతమంది పోలీసులు మాస్కు పెట్టుకోలేదు అనే కారణంతో జనాల పై దాడి చేయడం లాంటివి కూడా చేసామ్. ఇక్కడ ఇలాంటి తరహా ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఇప్పటివరకు సామాన్యులపై పోలీసులు విరుచుకుపడడం చూశాము. కానీ ఇక్కడ ఒక ఆర్మీ జవాన్ అని కూడా చూడకుండా పోలీసులు చితకబాదారు.
మాస్క్ పెట్టుకోలేదు అన్న కారణంతో ఏకంగా ఆర్మీ జవాన్ ని పోలీసులు దారుణంగా కొట్టిన ఘటన జార్ఖండ్ లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. చత్రాలో జవాన్ పవన్ కుమార్ బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడే తనిఖీలు చేస్తున్న పోలీసులు మాస్క్ లేదు అనే కారణంతో అతన్ని అడ్డుకున్నారు. పవన్ కుమార్ కి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కానిస్టేబుళ్లు పవన్ కుమార్ ను లాఠీలతో కొట్టారు. అంతే కాదు కింద పడేసి బూట్ కాలుతో తంతు దారుణంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీనిపై స్పందించిన స్థానిక ఎంపీ ఇక ఎస్పీ తో మాట్లాడి జవాన్ పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.