చిరుతకు ముచ్చెమటలు పట్టించిన ముళ్లపంది.. వైరల్ వీడియో?

praveen
చిరుత పులి.. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకొని రంగంలోకి దిగింది అంటే చాలు.. ఆ టార్గెట్ చిరుతపులి కి ఆహారంగా మారాల్సిందే.  ఎదురుగా ఎలాంటి జంతువులు ఉన్న సరే.. ఎంతో  దూకుడుగా వేటాడుతూ ఉంటుంది చిరుత పులి.  చిరుత పులి వేటాడుతూ ఉంటే అది చూస్తున్న వారందరూ కళ్లప్పగించి చూస్తూ ఉంటారు. చాలామంది చిరుతపులి ఎలా వేటాడుతుంది అనే విషయాన్ని అటు యానిమల్ ప్లానెట్ ఛానల్ లో గాని లేదా సోషల్ మీడియా చూస్తూ ఉంటారు.  అయితే చిరుతపులి ఎంత షార్ప్ గా ఎంతో వేగంగా పరిగెడుతూ ఎంత అద్భుతంగా వేటాడుతూ ఉండటం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.

 అయితే ఇలా ఒక అద్భుతమైన వేటగాడు అయిన చిరుత పులి కె ముచ్చెమటలు పట్టించటం అంటే మామూలు విషయం కాదు కదా.. కానీ ఇక్కడ ముళ్లపంది మాత్రం ఇదే చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా అడవిలో తిరిగే ముళ్లపంది ఏకంగా నడిరోడ్డు మీద కి వచ్చేసింది. ఈ క్రమంలోనే అక్కడే మాటు వేసి కూర్చుంది చిరుతపులి. ముళ్ళ పంది నడిరోడ్డు మీద కి రావడంతో ఇక దానిని ఒక పంజాతో ఆహారంగా మార్చుకోవాలి అని అనుకుంది. కానీ ఆ ముళ్లపంది మాత్రం చిరుతపులికి అస్సలు లొంగలేదు. ఏకంగా చిరుతపులి దాడి చేయడానికి వచ్చినప్పుడల్లా ఎంతో పదునైన బాణాల లాంటి తన ఈకలను  చిరుతపులి శరీరంలోకి చోచ్చుకు పోయే విధంగా వదిలింది.

 అదే సమయంలో అటు చిరుతపులి కూడా పట్టు విడువలేదు. ఎన్ని ఈకెలు గుచ్చుకుంటున్న  అటు ముళ్ల పందిని ఆహారంగా మార్చుకోవడమే లక్ష్యంగా దాడి చేస్తూ వచ్చింది. కానీ ముళ్ళ పంది దాటికి అటు చిరుతపులి మాత్రం ఏమీ చేయలేకపోయింది. ఏకంగా ముళ్ళపంది తన బాణాల లాంటి ఈకలతో చిరుతపులిని గాయాలపాలు చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: