క్రియేటివిటీ పీక్స్.. కోహ్లీ @బాలీవుడ్ స్టార్ హీరో?

praveen
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఇక సోషల్ మీడియా పుణ్యమా అన్ని విషయాలను కూడా కేవలం నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నాము.  అయితే మొబైల్లో సోషల్ మీడియా చూస్తున్నప్పుడు కొన్నికొన్ని చిత్ర విచిత్రమైన ఫోటోలు తారసపడుతుంటాయ్. ఇక ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు వామ్మో ఇదేమి క్రియేటివిటీ రా బాబు అంటూ ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

 క్రియేటివిటీ ఉండాలే కానీ అడ్డు అదుపు ఏముంది అన్నట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు ఎన్నో రకాల మీమ్స్ ఫోటోలు కూడా వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఫోటోలు చూసినప్పుడు  ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి రా బాబు అని అనిపిస్తూ ఉంటుంది. కలలో కూడా ఊహించని విధంగా కొన్ని రకాల ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్. ఇక్కడ ఇలాంటి తరహా  ఒక ఫోటో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 అయితే క్రికెటర్లకు సంబంధించి ఏదైనా అంశం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్గా మారిపోతూ ఉంటుంది.  ఇక్కడ ఇలాంటి ఒక ఫోటో వైరల్ గా మారి పోయింది. కాగా ఈ ఫోటో లో ప్రస్తుతం క్రికెట్ లో కొనసాగుతున్న వారు భవిష్యత్తులో ఏం అవ్వబోతున్నారు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం భారత మాజీ ఆటగాళ్లుగా కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోని భవిష్యత్తులో ఆర్మీ ఆఫీసర్ గా సెటిల్ అవుతాడు అని చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం టీమిండియా కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ ఏకంగా బాలీవుడ్ హీరోగా ఫ్యూచర్ లో మారిపోతాడట. కేఎల్ రాహుల్ కామెంటేటర్ గా మిగిలిపోతాడట. ఇలా ప్రస్తుతం స్టార్ క్రికెటర్ గా ఉన్న వారు భవిష్యత్తులో ఏం కాబోతున్నారూ అనే విషయాన్ని తెలియ జేసే విధంగా ఈ ఫోటో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఇది చూసి వామ్మో ఇదేం క్రియేటివిటీ బాసు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: