ఆ దీవిలో అడుగుపెడితే చావే గతి..

Purushottham Vinay
ఇక నీటిపై తేలియాడే నగరం ‘వెనీస్’ గురించి  ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ నగరానికి 16 కిమీల దూరంలో ఓ అందమైన దీవి ఉంది. అది కూడా ప్రజలు నివసించేందుకు ఎంతో అనుకూలమైన ప్రాంతమే. కానీ, ఎవరూ కూడా ఆ దీవికి వెళ్లే సాహసం చేయడం లేదు. ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సైతం వెనుకడుగు వేస్తోంది. అందుకే అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వానికే ధైర్యం లేదు. మరి సాధారణ ప్రజలు అక్కడ ఉండగలరా? ఆ దీవిలో అడుగుపెట్టేందుకు ఎందుకు మరీ అంత భయపడుతున్నారు?ఇక ఆ అందమైన దీవి పేరు ‘పోవెగ్లియా’. కానీ, ఇటలీ ప్రజలు మాత్రం దాన్ని ఓ శవాల దిబ్బగా పేర్కొంటారు. అయితే అది స్మశానం మాత్రం కాదు. ఒకప్పుడు ప్లేగు వ్యాధితో నరకయాతన అనుభవించిన రోగుల ఆర్తనాదాలతో మారుమోగిపోయిన భూలోక నరకమట అది. ఇక 16వ శతాబ్దంలోనే సుమారు లక్ష మంది పైగా రోగులు అక్కడ మరణించారని చెబుతుంటారు.
ఇక కాలక్రమేనా ఆ ప్రాంతంలో ప్రజలు నివసించడం కూడా మానేశారు. అయితే, వెనీస్ వంటి నగరాల్లో పర్యటించేందుకు వచ్చే చాలామంది పర్యాటకులు ఆ దీవిని వీక్షించేందుకు అక్కడికి వెళ్లేవారు. కానీ, మళ్లీ వారు తిరిగి రాలేదు.ఇక 16వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి ఇటలీని చాలా భయాందోళనకు గురిచేయడం జరిగింది.ఇక వ్యాధిగ్రస్తులను అక్కడే ఉంచితే అది చాలా మందికి సోకుతుందనే ఉద్దేశంతో శవాలను ఇంకా రోగులను తీసుకెళ్లి ‘పోవెగ్లియా’లో వదిలేయడం జరిగింది.ఇక దాంతో రోగులు ఆ శవాల మధ్యే జీవించేవారట. తిండి తిప్పలు లేక, రోగానికి చికిత్స లభించక అక్కడే వారు దారుణంగా చనిపోయేవారు. అంతేగాక వీరిలో చిన్నారులు కూడా ఉండేవారట. ఇక ఈ అరాచకాన్ని అప్పట్లో పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా కూడా లాభం లేకుండా పోయింది. ఇక ఎన్నో పోరాటాల తర్వాత ప్రభుత్వం అక్కడ ఒక చర్చితోపాటు రోగులు ఉండేందుకు ఓ భవనం నిర్మించడం జరిగింది. కొన్ని వేల సంఖ్యలో చనిపోయిన రోగులను ఆ దీవిలోనే సామూహికంగా పూడ్చిపెట్టేశారట. ఇక స్థలం లేకపోవడంతో మిగతా శవాలను దహనం చేసేవారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: