వర్క్ ఫ్రమ్ హోమ్.. వేరే లెవల్.. వైరల్ వీడియో?
ఇప్పటివరకు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఎంతో మంది ఉద్యోగులు వివిధ రకాల పనులు చేస్తూనే ఇక లాప్ టాప్ ముందు పని చేస్తున్న వీడియో లు కూడా ఎన్నో వైరల్ గా మారిపోయాయి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం వర్క్ ఫ్రం హోమ్ అనే పదాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న వ్యక్తిని చూస్తే మాత్రం వామ్మో వర్క్ ఫ్రం హోమ్ ఏ రేంజ్ లో ఉందో అని అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే అతను పెళ్ళికొడుకు కాబట్టి. పెళ్లి వేడుకలో కూడా లాప్ టాప్ ముందు వర్క్ ఫ్రం హోం చేస్తూ కనిపించాడు సదరు వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. వర్క్ పట్ల అంకిత భావం అంటే ఇదేనేమో అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.
ఏకంగా పెళ్లి జరగడానికి కొద్ది నిమిషాల ముందు వరుడు తన లాప్ టాప్ తో మండపంలో కూర్చున్నాడు. చుట్టూ పెళ్లి వేడుక బంధుమిత్రులు అందరూ ఉన్నారు కానీ వరుడు మాత్రం తన లాప్ టాప్ లో వర్క్ చేస్తూ ఎంతో బిజీగా మారిపోయాడు. ఇక పక్కన ఉన్న వారిని ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు దీంతో కొంత మంది బంధువులు తలలు పట్టుకున్నారు అయితే దీనికి సంబంధించిన వీడియోని అక్కడ ఉన్న కొంతమంది ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది ఏకంగా వరుడు లాప్టాప్ లో వర్క్ పూర్తి చేసుకునే సందర్భంలో పక్కనే ఉన్న పురోహితుడు ఆ పెళ్లి వేడుకలో ఉన్న బంధువులు కుటుంబ సభ్యులు సైతం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.