కూరగాయల వ్యాపారంతో బంగారం సంపాదించుకున్న జంట...

Purushottham Vinay
కూరగాయల వ్యాపారం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ వ్యాపారాన్ని ఎక్కువగా పేదలు, మధ్య తరగతి వారు చేస్తూ వుంటారు. ఇక ఈ వ్యాపారం వల్ల కేవలం పూట గడుస్తుందే కాని ఎక్కువ డబ్బులు సంపాదించుకోలేము. ఒక్కోసారి వ్యాపారం కూడా సరిగ్గా సాగదు. ఇక ఈ వ్యాపారం చేసుకునే ఓ జంట బాగా ధనవంతులయ్యారు. ఎంత ధనవంతులు అయ్యారంటే వారు ఒళ్ళంతా కేజీ బంగారం సంపాదించుకునేంత ధనవంతులయ్యారు.ఇక అసలు ఈ జంట అమ్మేది కూరగాయలా లేక మణి- మాణిక్యాలా? ఆశ్చర్యమేస్తుంది..కరెక్టుగా ఈ ఇద్దరు భార్యాభర్తల ఒంటిపై కిలోల కొద్దీ బంగారముంటుంది. ఒకప్పుడు బండిపై కూరగాయలు అమ్మేవారు..ఇక ఇప్పుడైతే ఒంటిపై ఏకంగా కిలోల కొద్దీ బంగారు నగలను దిగేసుకుంటున్నారు..అసలు కూరగాయల అమ్మకంలో ఇంత లాభముందా?అనే విధంగా ఆశ్చర్యపరుస్తున్నారు.. ఈ బంగారు జంట విషయానికి వస్తే...వీరు ఇద్దరూ కూడా రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ కు చెందిన కన్హయ్యా లాల్, గీతాదేవి దంపతులు.


ఇరవై సంవత్సరాల క్రితం వీరు చిత్తోర్ గడ్ రోడ్డు పక్కన బండి మీద పండ్లూ- కూరగాయలను అమ్ముకునేవారు.  ఇక కూరగాయల వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్న ఈ జంట తరువాత ఆపిల్ డస్ట్రిబ్యూటర్స్ గా మారారు. దీంతో వీరి సంపాదన బాగా పెరిగింది. ఇక అక్కడి నుంచీ వీరికో టేస్ట్ ఏర్పడటం జరిగింది.అదే గోల్డెన్ కలెక్షన్ టేస్ట్ అట. వచ్చిన డబ్బును వచ్చినట్టుగా వీరు బంగారం కొనేసేవాళ్లు. అలాగ మొదలైన వీరి గోల్డెన్ కలెక్షన్ ఇప్పుడు అసలు ఒకటీ రెండు కాదు ఏకంగా 6 కిలోలకు చేరడం జరిగింది. ఇక భర్త కన్నయ్య ఒంటిపై ఎప్పుడూ మూడున్నర కిలోల బంగారముంటుందట. అలా నగలు మాత్రమే కాదు అతడి మొబైల్, ఆఖరున చెప్పులు కూడా బంగారమేనట.ఇక కన్నయ్య మాత్రమే కాదు,అతని భార్య గీతాదేవి.. కూడా మూడు కిలోల బంగారంతో తళతళమెరిసిపోతూ కనిపిస్తుంది.గీతా దేవి ఒంటిపై బంగారం ఎవరైనా దొంగలొచ్చి దోచుకుపోకుండా కన్నయ్య తన భార్యకు ఏకంగా లైసెన్స్డ్ రివాల్వర్ సైతం కొనిచ్చాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: