వ్యాక్సిన్ వేసుకుంటేనే పెళ్లికి రండి...!

MADDIBOINA AJAY KUMAR
దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సెకండ వేవ్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ప‌లు రాష్ట్రాలు లాక్ డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. దేశంలో క‌రోనా కేసుల ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న రాష్ట్రాల్లో మ‌హార‌ష్ట్ర మొద‌టి స్థానంలో ఉంది. దాంతో మ‌హ‌రాష్ట్రలోని నాగ్‌పూర్ లో ఇప్ప‌టికే లాక్ డౌన్ అమ‌లు చేసారు. ఇక త‌మిళ‌నాడులోను కేసుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. మ‌రోవైపు తెలుగురాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజుకు రెండు వంద‌ల వ‌ర‌కు కేసులు న‌మోద‌వుతున్నాయి. ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్యలు తీసుకున్నా ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం లేనిదే క‌రోనా ను క‌ట్టడి చేయ‌డం సాధ్యం కాదు. ప్ర‌భుత్వం హెచ్చరిస్తున్నా వినకుండా  సామాజిక కార్య‌క్ర‌మాలు వివాహ శుభ‌కార్య‌క్ర‌మాల‌కు అధిక సంఖ్య‌లో బంధువును స్నేహితుల‌ను ఆహ్వానిస్తున్నారు. దాంతో క‌రోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగే ప్ర‌మాదం ఉంది. అయితే  తాజాగా ఓ కుటుంబం వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. త‌మ కుమారుడి పెళ్లికి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌ని స‌రిగా వ్యాక్సిన్ తీసుకునే రావాల‌ని ష‌ర‌తు విదించింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే...గుంటూరు సాయి భాస్క‌ర్ హాస్పిట‌ల్ లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. అయితే సత్తెనపల్లికి చెందిన గోకుల్‌కు విజయవాడకు చెందిన భావ్యతో జనవరి 9న నిశ్చితార్థం జరిగింది. జూన్‌ 5న వీరి వివాహ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. అయితే నిశ్చితార్థం జరిగిన నాటి నుండి రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో అప్ప‌మ‌త్త‌మ‌యిన పెళ్లి కుమారుడి కుటుంబంలోని 20 మంది గుంటూరు సాయి భాస్క‌ర్ హాస్పిట‌ల్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మ‌రోవైపు పెళ్లి కూతురు భ‌వ్య త‌రుపున కుటుంబ స‌భ్యులు 20 మంది విజ‌య‌వాడలో వ్యాక్సిన్ వేసుకున్నారు. మ‌రోవైపు పెళ్లికి వ‌చ్చే త‌మ బంధులంతా వ్యాక్సిన్ వేసుకోవాలని వాట్స‌ప్ మెసేజ్ లు..ఫోన్ ల ద్వారా స‌మాచార‌మిచ్చారు. ఇక వ్యాక్సిన్ కోసం వ‌చ్చిన కుటుంబ సభ్యులను సాయిభాస్కర్‌ హాస్పటల్‌ అధినేత, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి అభినందించారు. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యుల‌తో పాటు పెళ్లి కూతురు కుటుంబ స‌భ్యుల‌ను స‌న్మానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: