భార్య క్రెడిట్ కార్డుతో ప్రియురాలి ట్రాఫిక్ చలాన కట్టిన భర్త....
పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ చలానాలు తాను కట్టలేదని, తన బాయ్‌ఫ్రెండ్ కట్టాడని తెలిపింది. దీంతో పోలీసులు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచి విచారించారు. ఈ సందర్భంగా అతడు అసలు విషయం చెప్పాడు. తాను నేరం చేయలేదని, అది తన భార్య క్రెడిట్ కార్డు అని తెలిపాడు. అది వినగానే అతడి గర్ల్‌ఫ్రెండ్ షాకైంది. అతడికి పెళ్లయిందనే విషయం తనకు తెలియదని పోలీసులకు తెలిపింది.దీంతో పోలీసులు అతడి భార్యకు కబురు చేయడం జరిగింది. జరిగిన విషయాన్ని ఆమెకు పూస గుచ్చినట్లు తెలిపారు. ‘‘మీ భర్త.. మీ క్రెడిట్ కార్డు ఉపయోగించి ప్రియురాలి ట్రాఫిక్ చలానాలు కట్టాడు. ఇందులో సైబర్ నేరగాళ్ల హస్తం లేదు’’ అని స్పష్టం చేశారు.
అతడికి గర్ల్‌ఫ్రెండ్ ఉందనే సంగతి తనకు అస్సలు తెలీదని భార్య తెలిపిందని దుబాయ్ పోలీస్ సైబర్ క్రైమ్ డిప్యూటీ డైరెక్టర్ అల్ షేహీ చెప్పారు. వాస్తవానికి అతడు ఒక్కసారి ట్రాఫిక్ చలానా చెల్లించి ఉంటే ఆమెకు అనుమానం రాకపోయేది. రెండు, మూడుసార్లు అదే పని చేయడంతో అడ్డంగా దొరికిపోయాడట.ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...