ఏపీ ప్రజలకు రెండు రోజులు భారీ వర్షాలు.. హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ..!!

Divya
గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి పలుచోట్ల వర్షాలు బాగానే పడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో కూడా వానలు ఎక్కువగా పడుతున్నాయి ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, రాయలసీమ ప్రాంతాలలో నిన్నటి రోజున వర్షం భారీగా కురిసింది. దీంతో ప్రజలు చాలా అవస్థలు పడ్డారు.. పలుచోట్ల కూడా డ్రైనేజీలు పొంగడంతో ట్రాఫిక్ కష్టాలు కూడా మొదలయ్యాయి. అమరావతి అచ్చంపేట పెదకూరపాడు తదితర మండలాలలో భారీ వర్షం కురిచినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మిరప, మొక్కజొన్న రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించినట్లుగా తెలుస్తోంది. వర్షంతో పాటు పిడుగులు కూడా పడడంతో కడియం వెంకట్రావు అనే వ్యక్తి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏపీలోని పలు ప్రాంతాలలో కూడా వర్షం కురవడంతో తాజాగా వాతావరణ శాఖ ఒక ఉత్తర్వును జారీ చేసింది మరో రెండు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడం జరుగుతోంది. విదర్భ నుండి తమిళనాడు వరకు తెలంగాణ కర్ణాటక మీదుగా ఈ వర్షం వెళుతుందని .. విపత్తుల సంస్థ ఎండి డిఆర్ అంబేద్కర్ తెలియజేయడం జరిగింది.
దీంతో రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షము అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ రోజున కోనసీమ, బాపట్ల, నెల్లూరు ,ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైయస్సార్, అనంతపురం, కర్నూలు, సత్యసాయి, నంద్యాల వంటి తదితర ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నది. రేపటి రోజున మాన్యం, అల్లూరి కోనసీమ, ప్రకాశం, కృష్ణ, తిరుపతి, చిత్తూరు ,అన్నమయ్య, కర్నూలు అనంతపురం సత్యసాయి నంద్యాల తదితర జిల్లాలలో తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అంతేకాకుండా ఉరుములు మెరుపులతో వర్షం రావడంతో పిడుగులు పడే అవకాశం ఉంది చెట్ల కింద ఎవరూ ఉండరాదని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: