వర్షాలతో ప్రజలు జాగ్రత్త.. ఆ జిల్లాలలో ఆరంజ్ అలర్ట్..!!

Divya
గడిచిన ఐదు రోజులలో రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. మరికొన్నిచోట్ల 35 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా ఎండలు నమోదయ్య అవకాశం ఉన్నది. అయితే ఈరోజు నుంచి మరో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పలు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈదురుగాదులు 40 కిలోమీటర్ల వేగంతో వడగండ్ల వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణం నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ రోజున తెలంగాణలో నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, హనుమకొండ, కామారెడ్డి తదితర ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో అక్కడక్కడ కోడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఈ జిల్లాలలో ఆరంజ్ అలర్ట్ ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. హైదరాబాదులో వర్షపు మేఘాలు ఎక్కువగా ఉండడం చేత తేలికపాటి నుంచి మోస్తారు వర్షం తోపాటు ఉరుములు వడగండ్ల వాడు కూడా పడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఉష్ణోగ్రతలు కూడా 35 డిగ్రీల నుండి 23 డిగ్రీలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆగ్నేయ దిశ నుంచి ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గాలిలో 79 శాతం తీమ నమోదయినట్లుగా గుర్తించారు

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఆంధ్రాలో అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ గాలులతో వీచిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలుపుతోంది. గడచిన మూడు రోజుల నుంచి కోస్తాలో వర్షాలు పడుతున్నాయని గాలులు సంగమంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా కోస్తాంధ్రకు బాగా అనుకూలించడం వల్ల వర్షాలు బాగానే పడుతున్నాయని తెలుపుతున్నారు ఇక రాయలసీమ జిల్లాలలో కూడా అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతోంది. కర్నూలు, నంద్యాల, కడపలో మాత్రం 50% వరకు పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: