Viral Video: లక్ అంటే ఇతనిదే.. గూస్బంప్స్ వీడియో?

Purushottham Vinay
మన టైం బాగుంటే ఏదైనా జరగొచ్చు.ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా కూడా చాలా ఈజీగా తప్పించుకోగలము. అలా పెను ప్రమాదం నుంచి తప్పించుకునే వారినే అదృష్టానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్నాడుగా అని అనుకుంటూ ఉంటాం.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఖచ్చితంగా ఇదే మాట అంటారు.ఇక హైవేపై ఓ వ్యక్తి కారులో వెళుతున్నాడు.అయితే ప్రయాణ సమయంలో రోడ్డును తన స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డు చేయడం అతను ప్రారంభించాడు. ఇక కారు చాలా వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ముందుగా ఓ భారీ ట్రాక్కు చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఇక అదే సమయంలో కారును ఓవర్‌ టేక్‌ చేస్తూ ఓ వ్యక్తి బైక్‌పై చాలా స్పీడ్ గా దూసుకొచ్చాడు. ట్రక్‌ని కూడా ఓవర్‌ టైక్‌ చేద్దామన్న ఆలోచనతో అతను స్పీడ్ గా ముందుకు దూసుకెళ్లాడు.అయితే అంతలోనే అక్కడ పెద్ద మలుపు వచ్చింది. అయితే చాలా బరువుతో వెళ్తున్న ఆ వాహనాన్ని కంట్రోల్‌ చేయలేకపోయాడు ఆ డ్రైవర్‌.


ట్రక్‌ కాస్త టర్న్‌ అవ్వగానే కంటైనర్‌ కుడివైపు అలాగే పడింది. సరిగ్గా ఆ కంటైనర్‌ పడుతున్న సమయంలో బైకర్‌ దెబ్బకి సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో క్షణాల్లో తన ప్రాణాలను కాపాడుకున్నాడు. బైకర్‌ బ్రేక్‌ వేయడంలో ఏమాత్రం అటు ఇటైనా కూడా ఖచ్చితంగా ప్రాణాలే కోల్పోయేవాడు. అయితే అదృష్టం కలిసొచ్చి క్షణాల్లో బ్రతికాడు. ఇదంతా కూడా వెనకాల కార్లో ఉన్న వాళ్లు రికార్డు చేశారు. ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతోంది. బైక్‌పై వెళుతోన్న వ్యక్తి అదృష్టాన్ని చూసి ఆ నెటిజన్లు ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతోంది. ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: