ఈ ఏడాది ఫస్ట్ సూర్యగ్రహణం.. వారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!!

Divya
సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ప్రారంభమైంది ఈరోజు ఉదయం 7:4 నిమిషాలకు ప్రారంభమైన ఈ సూర్యగ్రహణం ఈరోజు మధ్యాహ్నం 12:29 నిమిషాల వరకు ఉంటుంది. దాదాపుగా మొత్తం ఐదు గంటల 25 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో మాత్రం కనిపించదు. పశ్చిమ ఆస్ట్రేలియా, ఆగ్నేయ మాసియాలోని పలు ప్రాంతాలలో.. పాటు థాయిలాండ్ ,అమెరికా ,మలేషియా ,జపాన్, న్యూజిలాండ్ ,హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, చైనా వంటి ప్రాంతాలలో కనిపిస్తుందట.
ఈ సూర్యగ్రహణానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.రెండు రకాల గ్రహాలు ఒకేసారి కనిపిస్తాయని తెలిపారు.ఇండియాలో ఇది కనిపించకపోయినప్పటికీ దీనిని చూడవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. చంద్రుని నీడ ఆస్ట్రేలియా అంచులు 40 కిలోమీటర్ల విస్తృతతో ఉండే మార్గంలో పడుతుందని తెలుపుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రాంతాలలో నింగలూ ప్రాంతం కూడా ఒకటి దాని గుండా అని ఈ గ్రహం కనిపిస్తూ ఉండడంతో దీనికి నింగలూ గ్రహం అని పేరు పెట్టడం జరిగింది.

ఇది వృత్తాకారంలో సంపూర్ణంగా ఉండే గ్రహం అని కూడా తెలియజేస్తున్నారు. సూర్యుడు భూమి మధ్యకు చంద్రుడు వచ్చినప్పుడు భూమిపై నీడ పడుతుందని అప్పుడే సూర్య గ్రహణం ఏర్పడుతుందని పండితులు తెలుపుతున్నారు. ఈ సూర్యగ్రహణం రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని విషయాన్ని కూడా జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
సూర్యగ్రహణం సమయంలో వండడం లేదా తినడం వంటివి అసలు చేయకూడదు ఇలా చేస్తే ఆరోగ్యం పైన ప్రభావం పడుతుందట.. ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలు సూర్యగ్రహణం చూడకూడదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే మకర రాశి వారు కూడా ఈ గ్రహణం తొలగిన వెంటనే గొడుగు, నలుపు లేదా నీలం బట్టలు ఆవాల నూనె వంటి వాటిని దానం చేయడం చాలా మంచిదట. అలాగే మీన రాశి జాతకులు గ్రహణం వెళ్లిపోయిన తర్వాత బెల్లం పసుపు వస్త్రాలు సెనగలు దారుణం చేయవచ్చు.. కుంభ రాశి వారు సూర్యగ్రహణం అయిపోయిన వెంటనే గొడుగు లేదా నలుపు బట్ట నీలి బట్టలు దానం చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: