వైరల్ : కళ్ళముందే నమ్మలేని అద్భుతం.. నదిలో నడిచిన మహిళా?

praveen
పంచభూతాలను ఆధీనంలోకి తెచ్చుకుంటే ఏదైనా చేయొచ్చు అని సినిమాల్లో కొన్ని డైలాగులు వింటూ ఉంటాం.. కానీ సినిమాల్లో డైలాగులు సినిమాల వరకు మాత్రమే పరిమితమవుతూ ఉంటాయి. నిజ జీవితంలో మాత్రం అస్సలు జరగవు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు వెలుగులోకి వచ్చే ఘటనలు మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఏకంగా కళ్ళ ముందు అద్భుతం జరుగుతూ ఉంటే చూసి నమ్మలేని స్థితిలో పడిపోతూ ఉంటారు ఎంతోమంది జనాలు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సాధారణంగా నీటిలో దిగితే ఎవరైనా సరే మునిగిపోతూ ఉంటారు.

 కానీ మొన్నటికి మొన్న ఏకంగా ఒక యువకుడు నదీ ప్రవాహాన్ని ఒక వైపు నుంచి మరోవైపుకు ఏకంగా బైక్ నడుపుతూ దాటడానికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ వీడియో గురించి మరవకముందే మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ నది ప్రవాహాన్ని ఒకవైపు నుంచి మరోవైపు దాటింది. అది కూడా నడుచుకుంటూ. దీంతో ఇక ఇది చూసిన జనాలు ఆమె దైవ స్వరూపం అని నమ్మడం మొదలుపెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  జబల్పూర్ జిల్లాలో ఒక వృద్ధురాలు నర్మదా నది నీటిపై నడుస్తున్నట్లు ఒక వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది.

 దిల్వారా ఘాట్ వద్ద నర్మదా నీటి ఉపరితలంపై నడుస్తున్న మహిళ అనే క్యాప్షన్ తో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన తర్వాత ఆ మహిళను చూసేందుకు స్థానికులు అందరూ కూడా నది ఒడ్డుకు భారీగా చేరుకున్నారు అని చెప్పాలి. నర్మదా మాత అంటూ ఒక పేరు పెట్టి ప్రజలు ఆమెను కీర్తించడం మొదలుపెట్టారు. ఇక నది జలాల మీద ఆమె నడుస్తుండగా దేవత కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అని అనుకున్నారు. నర్మదా తీరం నుంచి ఆమెను స్థానికంగా ఒక ఇంటికి తీసుకువెళ్లారు. అయితే నర్మదా నది ప్రవాహంలో నీటిమట్టం తక్కువగా ఉండడం.. అక్కడక్కడ ఇసుక పేరుకుపోయి ఉండడం కారణంగానే ఆమె అలా నడిచి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరి కొంతమంది అసలు ఆ వృద్దురాలు నర్మదా నదిలోనే నడవలేదు అదంతా ఫేక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: