పిల్లి ఇచ్చిన పంచ్ కి.. పాము దిమ్మ తిరిగిపోయింది?

praveen
ఇటీవల కాలం లో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ విషయాన్ని ఇంటర్నెట్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు తెరమీదకి వస్తూ నెటిజెన్స్ దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఇలాగే ఒక పిల్లికి సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.

 ఇటీవల కాలంలో పిల్లి పెంపుడు జంతువుగా మారిపోయింది. కుక్కల తర్వాత ఇక మనుషులు ఎక్కువగా పెంచుకుంటుంది పిల్లలని అని చెప్పాలి. ఇక పెంపుడు పిల్లలు ఎంతో అల్లరి చేస్తూ యజమానులను సంతోషపరుస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా పిల్లులు ఎప్పుడూ ఎంతో అలర్ట్ గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక రెప్పపాటు కాలంలో ఎంతో వేగంగా స్పందిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత పిల్లి ఎంత వేగంగా స్పందిస్తుంది అన్నది అర్థమవుతుంది.

 ఇలా ట్విట్టర్లో  వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే బంగారు వర్ణపు రంగులో ఉన్న పిల్లి తో పాటు నలుపు రంగులో ఉన్న మరో పిల్లి ఒకచోట ఉన్నాయి. సరదాగా అవి ఆడుకుంటుండగా అంతలో అక్కడికి ఒక ఉపద్రవం వచ్చి పడింది. ఒక పాము ఆ రెండు పిల్లుల వద్దకు దూసుకు వచ్చింది. పాము వచ్చి ఒక్కసారిగా ఎటాక్ చేయబోయింది. దీంతో ఆ పిల్లి ఏకంగా ఒక్కసారిగా ఒక పంచ్ ఇవ్వడంతో ఆ పాము దిమ్మతిరిగింది. మరోసారి అటాక్ చేయబోయిన పాముకు మళ్ళీ అలాగే పంచ్ పడింది. ఈ వీడియో వైరల్ గా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: