దేశంలో మరొకసారి కరోనా అలజడి..!!

Divya
గడచిన రెండు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ వల్ల అన్ని దేశాలు కూడా ఇబ్బందులు పడ్డాయి.. ఈ వైరస్ వల్ల ఎంతోమంది మరణించడం కూడా జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ కరోనా వైరస్ నుంచి కాస్త బయటపడుతున్న తరుణంలో ఇప్పుడు తాజాగా మరొకసారి కరోనా అలజడి రేపుతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుదల ఎక్కువగా కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం పలు దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా సోమవారం రోజున రాష్ట్రాలతో కేంద్ర వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనుంది. కేసులు ఉన్నఫలంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 10 ,11 వ తేదీలలో మాకు డ్రీమ్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఇప్పుడు దేశంలో కరోనా కేసుల సంఖ్య 1590 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఆరుగురు ఇప్పటికి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారణ చేయడం జరిగింది.
దాదాపుగా కొన్ని నెలల తరువాత కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్రం మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.146  రోజుల తర్వాత ఒకేరోజు అత్యధిక కేసులు నమోదు అవ్వడం ఇదే మొదటిసారి.. గత ఐదు వారాలలో దేశంలో కేసులు తొమ్మిది రెట్లు ఎక్కువగా పెరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేయడం జరిగింది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని టీకాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచిస్తోంది దేశంలో పెరుగుతున్న కేసులకు ఓమిక్రమ్ సబ్  వేరియంట్ XBB.1.16 సబ్బు వేరేట్టుగా భావిస్తూ ఉన్నారు. ఢిల్లీలో నిన్నటి రోజున 152 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయట. అయితే అంతకుముందు జరిగిన నెలలో 100 కేసులు నమోదయ్యాయి అలాగే మహారాష్ట్రలో కూడా నిన్నటి రోజుకి 343 కోవిడ్ కేసులు నమోదయ్యా. ఇందులో ముగ్గురు మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: