గుండె ధైర్యం అంటే నీదే భయ్యా.. సింహానికే బస్తీమే సవాల్?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది వైల్డ్ లైఫ్ లవర్స్ ఇక ఎక్కువగా జంతువులు ఉండే ఫారెస్ట్ లోకి వెళ్లి సఫారీ వాహనాల్లో కూర్చొని ఇక జంతువులను ఎంతో దగ్గరగా ఫోటోలు వీడియోలు తీయడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఇలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా అడవుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సార్లు సింహాలు, పులులు లాంటి ప్రమాదకరమైన జంతువుల దగ్గరగా వెళ్లి కూడా ఫోటోలు తీయడం చూస్తూ ఉంటాం. ఇక ఇలాంటివి చూసినప్పుడు వీరి గుండె ధైర్యానికి సలాం కొట్టాల్సిందే అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది.

 ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియో చూస్తే మాత్రం అతనిది మామూలు గుండె కాదు.. మరి ఇంత గుండె ధైర్యం ఏంటి భయ్యా అని ప్రతి ఒక్కరికి అనాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏకంగా సింహంతోనే సావాసం చేశాడు ఒక వ్యక్తి. అతను జీప్ ముందు భాగంలో కూర్చుని ఏకంగా అక్కడ కనిపించే జంతువులను కెమెరాలో ఫోటోలు వీడియోలు తీయడం లాంటివి చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక్కసారిగా ఒక భారీ సింహం అతని దగ్గరికి వచ్చింది.

 ఇక సింహాన్ని చూసిన సదరు వ్యక్తికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది అది కూడా ఏకంగా దగ్గరికి వచ్చి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మృగరాజు చూస్తూ ఉంటే అతనికి ఏం చేయాలో పాలు పోలేదు. ఇక బొమ్మలాగా అలాగే చలనం లేకుండా ఉండిపోయాడు. అయితే కాసేపు అతన్ని అలాగే చూసిన సింహం.. ఆ తర్వాత తన దారిన అది వెళ్లిపోయింది. ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూస్తే మాత్రం దగ్గరికి వచ్చి సీరియస్ గా చూస్తున్న సింహం కళ్ళలోకి అతను కూడా ఎంతో సీరియస్గా చూసి బస్తీమే సవాల్ అన్నట్లుగా ఉండిపోయాడు అని చెప్పాలి. ఇక ఇది చూసి నీ గుండె ధైర్యం ఏంటి భయ్యా.. మరి రిస్క్ చేస్తున్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: