కుక్కను సుస్సు పోయించిన కోడి.. వీడియో వైరల్?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎన్నో రకాల చిత్ర విచిత్రమైన వీడియోలు ఇంటర్నెట్ లోకి వచ్చేస్తూ ఉన్నాయి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోకి వచ్చే కొన్ని వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా ఇందులో జంతువులు పక్షులకు సంబంధించిన వీడియోలు అయితే ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ ఉంటాయి. సాధారణంగా జంతువుల మధ్య జాతి వైరం కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బలవంతుడిగా ఉన్న ఒక జంతువు ఇక తనకంటే తక్కువ బలం ఉన్న జంతువులపై ఆధిపత్యం చెలాయించడం కొన్ని సార్లు దాడులు చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది.

 అయితే మరికొన్నిసార్లు మాత్రం ఇక బలహీనమైన జంతువులు కూడా తమ కంటే ఎక్కువ బలం ఉన్న జంతువులను బెదిరించడం లాంటివి వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇంకా ఇలాంటివి చూసినప్పుడు నెటిజెన్స్ అందరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్లో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. నేటిజన్స్ దృష్టిని తెగ ఆకర్షిస్తుంది. సాధారణంగా వీధి కుక్కలు ఎక్కడైనా కోడిని చూసాయి అంటే చాలు లటుక్కున పట్టుకొని ప్రాణాలు తీసి ఇక ఆహారంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.

 వెంటాడి వేటాడి మరి కోళ్లను చంపడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చాలామంది చూసే ఉంటారు. అందుకే ఎక్కడైనా కుక్క కనిపించిందంటే చాలు కోడి అక్కడి నుంచి పరుగో పరుగు అంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు  తనకంటే ఎంతో బలం కలిగిన కుక్కను ఎదిరించింది ఒక కోడి. ఎక్కడ భయం బెరకు లేకుండా కుక్కతో బీకర పోరుకు దిగింది అని చెప్పాలి. అయితే తనకంటే తక్కువ బలం ఉంది అని తెలిసిన కోడి ధైర్యం చూసి కుక్కకు సైతం వణుకు పుట్టింది. ఒక రకంగా కోడి కుక్కకు చుచ్చు పోయించింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా కోడి ధైర్యానికి అటు నేటిజన్స్ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: