Viral Video: నెటిజనులను ఫిదా చేస్తున్న మెట్రో ట్రైన్?

Purushottham Vinay
ఇక సింగపూర్‌కు చెందిన మెట్రో రైల్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఎంతగానో ఫిదా అయిపోతున్నారు.ఇలాంటి సౌకర్యమే కదా కావాల్సింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఈ సౌకర్యం చూసే మనకే ఇలా ఉంటే.. ఇక ఆ మెట్రోలో వెళ్లే వారికి ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నారు.మన దగ్గర ఉన్నట్లుగానే సింగపూర్‌లో కూడా మెట్రోట్రైన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే, అవి మనకంటే చాలా అడ్వాన్స్‌డ్ ట్రైన్స్.ఎందుకంటే ఇవి ప్రజల ప్రైవసీకి ప్రొటక్షన్ ఇచ్చే ట్రైన్స్. మన దేశంలో మెట్రోలో వెళ్తుంటే.. చుట్టూ ఉన్న బిల్డింగ్స్, అపార్ట్‌మెంట్స్ ఇంకా గదులు ఇతరరత్రా అన్నీ కనిపిస్తాయి. కానీ, సింగపూర్‌లో మాత్రం అలా అసలు కనిపించదు. దానికి కారణం.. ప్రజల ప్రైవసీ.అక్కడి ప్రజల ప్రైవసీని కాపాడేందుకు మెట్రోలో అప్డేటెడ్ టెక్నాలజీని ఉపయోగించారు సింగపూర్ అధికారులు.సింగపూర్‌లో మెట్రో విండోస్ చాలా విచిత్రంగా ఉన్నాయి. 


ఓపెన్ ప్లేసెస్ ఉన్నంత దాకా మెట్రో గ్లాస్‌ నుంచి బయటి వాతావరణం అంతా క్లియర్‌గా కనిపిస్తోంది. అదే సమయంలో ఇళ్లు ఇంకా అలాగే హోటళ్లు రాగానే ఆ విండోస్ అనేవి ఆటోమాటిక్‌గా బ్లాక్ అవుతున్నాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఆ విండో గ్లాస్‌లు మూసివేసినట్లుగా బ్లర్ అవుతున్నాయి.సింగపూర్‌లో ఈ మెట్రో ట్రైన్‌ని బుకిట్ పంజాంగ్ లైట్ రైల్ ట్రాన్సిట్(LRT) అని అంటారు. ఈ రైళ్లకు స్మార్ట్ మిస్టింగ్ గ్లాసెస్ ని ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ట్విట్టర్‌లో ఈ వీడియోని షేర్ చేయగా..ఆ వీడియోకి నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి దాకా ఈ వీడియోను 33 వేల మందికిపైగా నెటిజన్లు చూశారు. ప్రైవసీకి ప్రయారిటీ ఇస్తున్న సింగపూర్ నిజంగా సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు. సింగపూర్ అనేది నెక్ట్స్ లెవెల్ అంటున్నారు.అయితే ఇది మెట్రో ట్రైన్ కాదని, మ్యాజిక్ ట్రైన్ అని అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: