Viral Video: కదులుతున్న కారులో కుర్రాళ్ళ స్టంట్స్?

Purushottham Vinay
ఢిల్లీ టూ మీరట్ హైవే రోడ్లపై కొంతమంది ఆకతాయి యువకులు భయంకర స్టంట్స్‌తో చాలా తీవ్రంగా బాధ్యత లేకుండా రెచ్చిపోయారు. ఏకంగా వారు కదులుతున్న కారుపై ఎక్కి ప్రమాదకర విన్యాసాలు చేశారు.ముగ్గురు కుర్రాళ్ళు కదులుతున్న కారులోంచి ప్రమాదకర రీతిలో బయటికి వంగి కనిపించారు. వారిలో ఒక కుర్రాడు అయితే ఏకంగా తన ఫోన్ కెమెరాలో కారు స్పీడును వీడియో తీస్తూ కనిపించాడు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి రోడ్డు భద్రతతో పాటు తమ ప్రాణాలకు కూడా ముప్పు కలిగించేలా తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌గా మారింది. దాంతో ఈ వైరల్ వీడియో మీరట్ పోలీసులకి దొరికింది. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వైరల్ వీడియోకు సమాధానంగా ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని పోలీసు యంత్రాంగం తెలిపింది.

ఇక ట్వీట్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. ఆ కుర్రాళ్ళు ప్రయాణిస్తున్న కారుపై పోలీస్ స్టిక్కర్ ఉన్నట్టుగా తెలిసింది. స్వాతి మలివాల్ చేసిన ట్వీట్‌ ఆధారంగా పోలీసు సైరన్, రెడ్ లైట్‌ ఇంకా అలాగే పోలీసు స్టిక్కర్ వేసి ఉన్న వాహనంలో వేలాడుతూ హైవేపై ప్రజలను బాగా భయబ్రాంతులకు గురిచేసేలా ప్రయాణించిన వారు ఎవరో ఖచ్చితంగా పోలుసులు తెలుసుకోవాలని సూచించారు. అయితే ఆ కారుపై పోలీస్ అని రాసి ఉంది. ఒకవేళ ఇది పోలీసు అధికారుల వాహనం అయితే, ఎవరి ప్రమేయంతో వాళ్లు ఇలాంటి స్టంట్ చేస్తున్నారో కనిపెట్టాలని డిమాండ్‌ కూడా చేశారు.ఈ ప్రమాదకరమైన వీడియో రికార్డ్ చేసిన వ్యక్తిని కూడా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.ఈ వైరల్ వీడియోలో జాకెట్లు ధరించిన ఆ కుర్రాళ్ళు డ్రైవింగ్ లో ఉన్న ఆ కారు కిటికీలోంచి బయటకు వంగి వేలాడుతూ కనిపించారు. ఇక ఈ మారుతీ సుజుకి కారు UP రాష్ట్రం క్రింద రిజిస్టర్ చేయబడింది. నంబర్ ప్లేట్ వచ్చేసి 'UP 14 AE 3621' అని రాసి ఉంది. ఇక సోషల్ మీడియాలో వీడియో బాగా చక్కర్లు కొడుతూ వైరల్‌ కావటంతో నెటిజన్లు కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి భయంకర విన్యాసాల కారణంగా కేవలం వారికి మాత్రమే కాదు,అక్కడ తోటి ప్రయాణికులు ఇంకా వాహనదారులకు కూడా ప్రమాదం పొంచివుందని నెటిజన్లు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపట్ల ఖచ్చితంగా చాలా కఠినంగా వ్యవహరించాలని కోరుతూ రీట్విట్‌ కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: