టికెట్ లేదని.. టీసీలు ఎంత దారుణంగా కొట్టారో చూడండి?

praveen
సాధారణంగా రైలు ప్రయాణాలు చేసే ఎవరైనా సరే టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది ప్రయాణికులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. రైల్వే టిసి వచ్చి ఏం చెక్ చేయడులే అన్నట్లుగా భావించి ఇక టికెట్ లేకుండానే ప్రయాణం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం రైల్వే టిసిలకు దొరికిపోయి చివరికి భారీ జరిమానాలు కట్టడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా టిసి చెకింగ్ కి వచ్చినప్పుడు ఎవరైనా ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడని తెలిస్తే ఇక భారీ జరిమానాలు విధించడం లేదా అధికారులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు టిసి.

 కానీ ఇలా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ విషయంలో మాత్రం కొంతమంది టీసీలు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు అన్నది తెలుస్తుంది. టికెట్ లేకపోతే జరిమానా విధించడం కాదు  ఏకంగా సదరు పాసింజర్ ను దారుణంగా చితకబదారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ముంబై నుంచి జై నగర్ వెళ్తున్న రైల్లో ధోలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టికెట్ లేదు అన్న కారణంతో ఇద్దరు టీసీలు పైన బెర్త్ లో కూర్చున్న వ్యక్తిని కిందికి దారుణంగా లాగి మరి చితక్కొట్టారు.

 ఒక వ్యక్తి రైల్లో పైన బెర్త్ లో కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన టిసి టికెట్ కోసం ప్రశ్నించగా సదరు ప్యాసింజర్ కి టిసి కి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన టిసి తోటి టిసి తో కలిసి ప్రయాణికుడు కాలు పట్టుకుని బలవంతంగా కిందకు లాగి నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత కాళ్లతో తంతు దారుణంగా దాడి చేశాడు. ఇక ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు  అయ్యాయి. అయితే ఇదంతా  అక్కడే ఉన్న వారూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా  మారిపోయింది. రైల్వే అధికారులు సదరు ఇద్దరు టీసీలను సస్పెండ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. వారిపై కఠినకఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: