వైరల్ : ప్రపంచంలోనే.. భయంకరమైన ఉద్యోగం ఇదేనేమో?

praveen
వ్యాపారం చేస్తే లాభాలు ఎలా ఉంటాయో.. రిస్క్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అందుకే ఏదో ఒక ఉద్యోగం చేసి ఇక కుటుంబాన్ని పోషించాలని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. జాబ్ సెక్యూరిటీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఉద్యోగం చేసేవారు ఇక మంచి వేతనం రావాలి కానీ ఎంతో సులువైన పని ఉండాలని కోరుకుంటూ ఉండడం సహజం అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎంతోమంది సులభతరమైన ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.

 కానీ ప్రపంచంలోనే ఎంతో ప్రమాదకరమైన ఉద్యోగాలు కూడా ఉన్నాయి అన్న విషయం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చినప్పుడు అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఉద్యోగానికి సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత మాత్రం ప్రపంచంలో ఇంతకంటే ప్రమాదకరమైన ఉద్యోగం మరొకటి లేదేమో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే వాళ్లు ఉద్యోగం చేసేటప్పుడు వేసే ప్రతి అడుగు కూడా ప్రాణాలను రిస్కులో పెట్టేయాల్సి ఉంటుంది.

 నిజానికి ఇక వారు అలా ప్రాణాలకు తెగించి పని చేస్తేనే మన జీవితాలు ఎంతో సాఫీగా సాగిపోతాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే  వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏకంగా ఒక ఉద్యోగి కొండల నడుమ ఒక భారీ విద్యుత్ తీగల పైన నిలబడి ఉన్నాడు. ఒకవైపు మంచు కురుస్తూ ఉంటే మరోవైపు భూమికి వందల అడుగుల ఎత్తులో వైర్లు ఉన్నాయి. ఇక సదరు ఉద్యోగి ఆ విద్యుత్ వైర్ల పైకి ఎక్కి ఇక వాటిని రిపేర్ చేస్తూ ఉండడం గమనార్హం. దీనిని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. వామ్మో ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా అని ప్రతి ఒక్కరూ నోరేళ్లు పెడుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: