యూట్యూబ్ లో వ్యూస్ కోసం కాలనాగుతో ఆటలు.. చివరికి ప్రాణం మీదికొచ్చింది?

praveen
ఇటీవల కాలంలో యూట్యూబ్ అనేది ఎంతోమందికి ఇన్కమ్ సోర్స్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద చదువులు చదివిన వారు సైతం యూట్యూబ్ లో టాలెంట్ లో నిరూపించుకొని లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు. దీంతో ఇక యూట్యూబ్ అండగా ఉండగా ఈ ఉద్యోగం ఎందుకు దండగ అన్న విధంగానే ప్రస్తుతం ఎంతోమంది ఇంటర్నెట్లో సెన్సేషన్స్ సృష్టిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది యూట్యూబ్లో లైక్ ల కోసం ప్రాణాలను పణంగా పెట్టుకొని మరీ రిస్కులు చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక్కడ ఒక యూట్యూబర్ ఏకంగా లైక్స్ కోసం చేసిన రిస్కీ పని కాస్త చివరికి ప్రాణాల మీదికి తెచ్చింది అని చెప్పాలి. 24 ఏళ్ల వయస్సున్న అమిత్ శర్మ రాజస్థాన్లో టాప్ యూట్యూబర్ గా కొనసాగుతున్నాడు.  అతను ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం వెతకకుండా యూట్యూబ్ వైపుకు అడుగులు వేశాడు. ఏకంగా అతను ఛానల్ కు 25 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని చెప్పాలి. దాదాపు నెలకు 9 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. ఇక ఎప్పుడూ సైన్స్ ఎక్స్పరిమెంట్స్ మీద వీడియోలు తీస్తూ ఉంటాడు ఆమిత్ శర్మ.

 అవే అతన్ని అందరిలో కెల్లా ప్రత్యేకంగా నిలబెట్టాయి అని చెప్పాలి. అయితే ఇటీవల ఒక కాలనాగుతో వీడియో తీయాలని ప్రయత్నించాడు. ఇక ఆ ప్రయత్నంలోనే చివరికి నాగుపాము అతని వేలిని కాటేసింది. అయితే ముందుగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు అమిత్ శర్మ. కానీ విషం మొత్తం శరీరమంతా పాకిపోవడంతో ఒక్కసారిగా కోప్పకూలిపోయాడు. ఇక వెంటనే స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల ఈ విషయాన్ని ఒక వీడియో రూపంలో అతని స్నేహితులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: