ఈ కార్ ఎవరు డిజైన్ చేశారో కానీ.. నిజంగా మహానుభావుడే?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపద్యంలో ఇలా ఇంటర్నెట్ ఎన్నో వింతలకు విశేషాలకు చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ఎన్నో ఆసక్తికర విషయాలు నెటిజెన్స్ దృష్టిని ఆకర్షిస్తూ ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రపంచ నలుమూలలో ఏం జరిగినా కేవలం నిమిషాల వ్యవధిలో  అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో వాలిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి ఒక విచిత్రమైన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత కళ్ళ ముందు ఉంది నిజమేన లేదా అని ఒక్క క్షణం పాటు అందరూ కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు అని చెప్పాలి.

 ఇటీవల కాలంలో ఎంతోమంది అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచించి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని భావిస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ వీడియోలో కనిపించే వ్యక్తి కూడా ఇలాంటిదే ట్రై చేశాడు అన్నది తెలుస్తుంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కార్లు ఒకే రకమైన డిజైన్ కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ వీడియోలో కారు చూసిన తర్వాత భూమ్మీద ఇలాంటి కారు కూడా ఒకటి ఉందా అనే ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతుంది అని చెప్పాలి. అందరికీ తెలిసిన కారు డిజైన్ కి ఇక్కడ వీడియోలో కనిపించిన కారు పూర్తిగా విరుద్ధంగా ఉంది అని చెప్పాలి.

 సాధారణంగా కస్టమర్లను ఆకర్షించేందుకు కార్ల కంపెనీలు ఎప్పుడు కొత్త డిజైన్లను ప్లాన్ చేస్తూ ఉంటాయి. అయితే ఇది కార్ కంపెనీ ప్లాన్ చేసిన డిజైనా లేకపోతే ఎవరైనా మహానుభావుడు ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడా మాత్రం అర్థం కాని విధంగా మారిపోయింది. ఎందుకంటే ఇటీవల వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే మాత్రం కార్ కి అన్ని కార్ల లాగానే డోర్స్ విండోస్ హెడ్లైట్ నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. కానీ కారు టైర్లు మాత్రం పైకి ఉండడం గమనార్హం. ఏకంగా తలకిందులుగా చూస్తేనే అది మన అందరికీ తెలిసిన కారులాగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోవడం తో ఇది చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ కారు ఎవరో మహానుభావుడు తయారు చేసి ఉంటాడు అని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: