రద్దీగా ఉన్న ఫ్లాట్ ఫామ్ మీదికి దూసుకొచ్చిన లారీ.. చివరికి?

praveen
సాధారణంగా రూల్స్ ప్రకారం రైల్వే స్టేషన్ లోపలికి ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఉండదు అన్న విషయం తెలిసిందే. అందుకే ప్రయాణికులు ఎంతో దూరం నుంచి రైల్వే స్టేషన్ వద్దకు వచ్చిన ఇక తమ వాహనాలను రైల్వే స్టేషన్ బయటనే పార్క్ చేసి ఇక లోపలికి వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది ఇక రద్దీగా ఉండే రైల్వే ప్లాట్ ఫామ్ పై కనీసం కాలు పెట్టడానికి కూడా గ్యాప్ ఉండదు అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఎంతోమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ రైల్వే ఫ్లాట్ ఫామ్ మీదికి వాహనాలను తీసుకువస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్లో వైరల్ గా మారిపోతూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి.

 మొన్నటికి మొన్న రైల్వే ప్లాట్ ఫామ్ పై ఏకంగా ఒక ఆటో డ్రైవర్ తన ఆటోని తీసుకువచ్చిన ఘటన హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి తరహా ఘటన జరిగింది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఆటో తీసుకురావడం కాదు ఏకంగా ఒక పెద్ద లారీని రైల్వే ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకురావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక రద్దీగా ఉండే ఫ్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులను కాస్త భయాందోళనకు కూడా గురిచేసింది అని చెప్పాలి. రద్దిగా ఉండే ప్లాట్ఫామ్ పై ప్రయాణికులు కూడా ఎప్పటిలాగే చాలామంది ఉన్నారు. అయితే ఏ రైల్వే స్టేషన్ అనేది స్పష్టత మాత్రం వీడియోలో కనిపించడం లేదు.

 కానీ ఇక వీడియోలో చూస్తున్నది ప్లాట్ ఫామ్ నెంబర్ 9 అన్న విషయం ఇక ఈ వీడియోలో కనిపిస్తుంది. ఎప్పటి లాగానే రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు ఫ్లాట్ ఫామ్ పై చాలామంది ఉన్నారు. ఇంతలోనే రైల్వే ఫ్లాట్ ఫామ్ మీదికి ఒక భారీ ట్రక్కు దూసుకు వచ్చింది. దీంతో ఇక ఫ్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదేంటి ట్రక్కు ఫ్లాట్ ఫామ్ మీదికి రావడం ఏంటి అని కాస్త కన్ఫ్యూషన్ లో ఉండిపోయారు. ఇక ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారగా ఇది చూసిన రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: