Viral Video: ఈ తల్లి కష్టానికి ఎవ్వరైనా సలామ్ కొట్టాల్సిందే?

Purushottham Vinay
అమ్మ అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు..ఒక ప్రపంచం కూడా. ఎందుకంటే అమ్మ అనే పదంలోని కమ్మదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. సోషల్ మీడియాలో మనకు ఎన్ని రకాల వీడియోలు కనిపిస్తున్నప్పటికీ..అమ్మకి సంబంధించిన వీడియో కనిపిస్తే మాత్రం ఆ వీడియోని చూడకుండా ఇంకా లైక్ చెయ్యకుండా ఉండలేము. అనుకోకుండా మన అమ్మను గుర్తు చేసుకుంటాము. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమ్మ ప్రేమకు సంబంధించిన ఓ వీడియో చాలా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా తల్లి ప్రపంచంలోని అతిపెద్ద యోధురాలని మనకు ఖచ్చితంగా అర్ధం అవుతుంది.తన బిడ్డ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా వుండే వ్యక్తి ఈ ప్రపంచంలో కేవలం తల్లి ఒక్కతే. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తన బిడ్డలను ఆదుకోవడంలో ముందుండేది తల్లి మాత్రమే. ఆమె ఎన్ని కష్టాలు పడినా కూడా తన బిడ్డకు మాత్రం ఎలాంటి బాధ కలగకూడదని కోరుకుంటుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు చూస్తే .ఒక తల్లి తన బిడ్డను వీపుకు కట్టుకుని ఒక పెళ్లి ఊరేగింపులో లైట్ పట్టుకుంది.


నెట్టింట వైరల్ అవుతున్న వీడియోని చూసినట్లయితే ఇదో ఊరేగింపులా అనిపిస్తోంది. అయితే ఇందులో జనాలు సంబరాలు చేసుకుంటుండగా  చాలా మంది మహిళలు డబ్బుల కోసం ఊరేగింపులో చేతిలో లైట్స్ పట్టుకుని రోడ్డుకు రెండు వైపులా నడుకుంటూ వెళ్తున్నారు. ఇలా నడుస్తున్న వారిలో ఒక మహిళ అక్కడ ఉన్నవారిని ఆకర్షించింది. అందుకే ఆ ఊరేగింపుని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎందుకంటే లైట్స్ పట్టుకుని నడుస్తున్న ఆ మహిళల్లో ఒక స్త్రీ ఓ చేతిలో లైట్ పట్టుకోవడమే గాక, తన వీపుకి బట్టని కూడా కట్టుకుని అందులో తన బిడ్డను పెట్టుకుని సంతోషముగా నడుస్తుంది. ఆమె తన బిడ్డను పెంచుకోవడానికి ఈ పని చేస్తోందని వీడియో చూస్తే తెలుస్తోంది. ఆ మహిళ నిస్సహాయతను చూసి ఆ జనం ఎంతగానో భావోద్వేగానికి గురవుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: