హస్బెండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాల్సిందే.. భర్త ఏం చేశాడో తెలుసా?

praveen
సాధారణంగా మహిళలు మేకప్ ని ఎంతగా ఇష్టపడుతూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడికైనా వెళ్తున్నాము అని తెలిస్తే చాలు ఇక ముఖం నిండా మేకప్ పూసేస్తూ ఉంటారు. ఇక తమ అందాన్ని మేకప్ వేసుకొని రెట్టింపు చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే భార్యలు మేకప్ వేసుకోవడాన్ని భర్తలు కొన్నిసార్లు ఇష్టపడినప్పటికీ.. ఇక మేకప్ పిచ్చి కొన్నిసార్లు భర్తలకు ఊహించని కష్టాలను తెచ్చిపెడుతుంది అని చెప్పాలి. ఇక భార్య మేకప్ వేసుకున్నప్పుడు భర్త ఎంతలా కష్టపడి పోతాడు అన్నదానికి నిదర్శనంగా మారిన ఒక వీడియో ఇటీవల ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.

 సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇక చూడటానికి ప్రేక్షకులు ఎంతోమంది వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కెమెరాల దృష్టిని ఆకర్షించేందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయేందుకు మేకప్ వేసుకొని మహిళలు స్టేడియంలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇక మ్యాచ్ మధ్యలో ఎప్పుడైనా మేకప్ చెరిగిపోయింది అని భావిస్తే నిర్మొహమాటంగా మళ్ళీ అందరి మధ్యలోనే మేకప్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఓ మహిళ ఇలాంటిదే చేసింది. అందరూ మ్యాచ్ చూస్తూ ఉత్కంఠ ను ఎంజాయ్ చేస్తూ ఉంటే సదరు మహిళ మాత్రం తాను అందంగా ఉన్నానా లేనా అన్న విషయం పై ఆలోచనలో మునిగిపోయింది.

 ఒకవైపు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఇక మరోవైపు గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న ఒక జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది అని చెప్పాలి. భర్త తన చేతితో ఇక మొబైల్ ఫోన్ పట్టుకోగా భార్య మాత్రం మేకప్ వేసుకుంటూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ని అక్కడే ఉన్న ఒక ప్రేక్షకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఇది చూసిన తర్వాత అతనికి హస్బెండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: