Viral Video: యువకుడి ప్రాణం తీసిన అతివేగం?

Purushottham Vinay
అతివేగం అనేది చాలా ప్రమాదకరమని, అది ప్రాణం తీస్తుందని తెలిసినా కూడా కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ దారుణంగా చనిపోతున్నారు. మరికొందరు అయితే వారితోపాటు ఇతరుల ప్రాణాలు కూడా తీస్తున్నారు.ఇక తాజాగా, ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై చాలా వేగంగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పరిధిలోని వివేకానంద నగర్ ప్రధాన రహదారిపై బుధవారం నాడు రాత్రి పూట ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై చాలా వేగంగా వెళ్లాడు. ఆ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పడంతో పల్టీలు కొడుతూ అక్కడ పడిపోయాడు. తీవ్రగాయాలైన యువకుడ్ని అక్కడి స్థానికులు ఇక ఆస్పత్రికి తరలించారు.అయితే, అప్పటికే ఆ యువకుడు తన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌గా మారింది. 


దీంతో నెటిజన్లు ఆ వీడియోని చూస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడని కొందరు కామెంట్స్ చెయ్యగా .. మరికొందరు మాత్రం అతి వేగం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. అయితే, అక్కడ అంతపెద్ద స్పీడ్ బ్రేకర్ ఎందుకు ఏర్పాటు చేశారని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమైనా కూడా  రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా వున్నా కూడా రోడ్డుపై ఎవరో ఒకరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఉంటారు. కాబట్టి రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి.లేదంటే ఇలా అనుకోని ప్రమాదాలను మీరు ఎదురుకోవాల్సి వస్తుంది. ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండండి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతోంది. ఇక మీరు ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: