దారుణం : చలాన్ విధించాలనుకున్న పోలీసు.. కానీ అతనేం చేశాడో తెలుసా?

praveen
రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని అటు ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా వాహనదారుల తీరు లో మాత్రం మార్పు రాదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికి అక్కడ సిగ్నల్స్ దగ్గర నిలబడుతూ ఇక రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు జరిమానా విధించడం లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎక్కడకక్కడ ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్న నేపథ్యం లో.. ఇక జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 ఎన్ని ప్రయత్నాలు చేసిన కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులకు దొరికి పోవడం ఇక జరిమానా చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది వాహన దారులు మాత్రం ఏకం గా ట్రాఫిక్ పోలీసులు ఎదురుపడిన  కూడా జరిమానా నుంచి తప్పించుకునేందుకు వారిని ఢీకొట్టేందుకు కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఇక్కడ మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒక వ్యక్తి చలాన్ ను తప్పించుకునేందుకు దారుణానికి పాల్పడ్డాడు. ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతున్న అతన్ని సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం రూల్స్ కి విరుద్ధం కావడంతో చివరికి చలాన్ వెయ్యడానికి  ప్రయత్నించాడు.

 అతను మాత్రం తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పోలీస్ కారుకు అడ్డుగా నిలబడ్డాడు.  అయినప్పటికీ వాహనతరుడు మాత్రం కారు ఆపలేదు. ఏకంగా ట్రాఫిక్ పోలీస్ పైకి కారు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. కారు ముందు భాగం లో ఉన్న పోలీసునూ నాలుగు కిలోమీటర్ల వరకు కారు తో పాటే లాక్కెళ్ళాడు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ట్విట్టర్ లో వైరల్ గా మారి పోయింది. ఈ క్రమం లోనే పోలీసులు అప్రమత్తమై ఇక ఆ వాహనదారూన్ని పట్టుకున్నారు. కాగా కార్లో తుపాకీ తూటాలు కూడా దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: