వారి కోసం దేవుడే దిగొచ్చాడా.. చివరి క్షణంలో ప్రాణం నిలిచింది?

praveen
మనిషి జీవితం దేవుడు చేతిలో కీలుబొమ్మలాంటిది అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే నేటి రోజుల్లో జనాలు ఇది ట్రాష్ అని కొట్టి పారేసిన.. ఇక ఇటీవల కాలంలో నిమిషాల వ్యవధిలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న తీరు చూసి పెద్దలు చెప్పింది నిజమే అని నమ్ముతూ ఉన్నారు అని చెప్పాలి. అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో క్షణకాల వ్యవధిలో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతున్న వారి సంఖ్య నేటి రోజుల్లో పెరిగిపోతోంది.

 అదే సమయంలో ఇక పెద్దలు చెప్పే మరో సామెతకు నిదర్శనంగా మారే ఘటనలు కూడా ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూమి మీద నూకలు తినే బాకీ ఉండాలే కానీ ఇక ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా ప్రాణాలకు ఎలాంటి హాని కలగదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని ప్రమాదాలను చూసినప్పుడు ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రాణాలు పోయాయని అందరూ అనుకుంటున్న సమయంలో క్షణకాల వ్యవధిలో ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడటం లాంటివి ఎంతో మంది విషయంలో జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది.

 నిజంగా రైలు వస్తూ ఉండడంతో ఇక రైల్వే ట్రాక్ వద్ద రోడ్డుపై వేచి ఆగింది ఒక కారు. అయితే యమ భటులు తోసినట్లుగానే ఏకంగా వెనకనుంచి ఒక ట్రక్ కారుని తోసింది. కారు రైల్వే ట్రాక్ పైకి వచ్చింది. అయితే ఇక ఈ ఘటనలో అప్పటికే కారు ఇంజన్ పాడయింది. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలో మరోవైపు నుంచి ట్రైన్ దూసుకు వచ్చింది. దీంతో కారులో ఉన్న కొందరు బయటకు దిగారు. డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి మాత్రం కారును స్టార్ట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇక ట్రైన్ రావడానికి ఒక్క క్షణం కాలంలో కారు స్టార్ట్ అయింది. దీంతో వెంటనే కాస్త ముందుకు పోనివ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న సిసి కెమెరాలలో రికార్డు కావడంతో వీడియో వైరల్ గా మారింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: