పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో.. మెట్రో ట్రైన్ లోకి టవల్ తో వచ్చాడు?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడానికి ఎంతో మంది చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో లైక్ ల కోసం కొంతమంది చేసే పనులు చూసి పిచ్చి పీక్స్ కు వెళ్లడం అంటే ఇదేనేమో అని నెటిజెన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇలా ఎంతోమంది నెటిజెన్స్ పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టడం.. ఇక ఆ వీడియోలు ఇటీవల కాలంలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.

 కొన్ని విచిత్రమైన వీడియోలతో ఓవర్ నైట్ లో పాపులారిటీ సంపాదించిన వారు కూడా చాలామంది ఉన్నారు.  ఇకపోతే ఇటీవలే ఇటీవల ఢిల్లీకి చెందిన ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తన సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చేసిన ప్రయత్నం కాస్త ప్రస్తుతం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. ఢిల్లీకి చెందిన మెహిత్ గౌహర్ అనే యువకుడికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఎప్పుడూ ఏదో ఒకటి వినూత్నంగా ట్రై చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ యువకుడు.

 ఎప్పటిలాగానే ఇక మరోసారి సరికొత్త వీడియోని పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. ఏకంగా ఢిల్లీ మెట్రో రైల్ లో టవల్ కట్టుకొని టీషర్ట్ వేసుకొని అటు ఇటు నడుస్తూ హంగామా చేశాడు అని చెప్పాలి. అయితే మోహిత్ ఇలా మెట్రో రైల్ లో టవల్ తో దర్శనం ఇవ్వడంతో అక్కడ ఉన్న యువతులందరూ కూడా అతని చూసి తెగ నవ్వుకున్నారు. అయితే ఇలా టవల్ కట్టుకొని నడవడమే కాదు ఇక అక్కడ రైలు అద్దాల్లో తన అందం చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ ఎంతగానో మురిసిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: