దొంగగా మారిన కోతి.. ఏం చోరీ చేసిందో తెలుసా?

praveen
ఇటీవల కాలం లో టెక్నాలజీ అందుబాటు లోకి వచ్చిన నేపథ్యం లో ఇక నేరాలను అరికట్టడం కోసం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను అమర్చుతు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే నేరస్తులు సైతం  సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతం  లో ఏమైనా చోరీలు చేయాలనుకున్న కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పొరపాటున సీసీ కెమెరాలు గమనించకుండా చోరీ చేస్తే చివరికి పోలీసులకు దొరికిపోయి జైలు పాలు అయ్యే అవకాశం ఉందని ఎంతోమంది భయపడిపోతున్నారు.

 కానీ ఇటీవల నేరాలను అరికడుతున్న సీసీ కెమెరాలు కూడా దొంగలిస్తున్న వారిని చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నేరాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు దొంగలు ఎత్తుకుపోయారు. అయితే ఇలా చోరీ చేసింది ఎవరో తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవ్వకుండా ఉండలేరు అని చెప్పాలి. ఎందుకంటే సీసీ కెమెరాలను దొంగలించింది మనిషి కాదు ఏకంగా కోతి. ఈ విచిత్రమైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

 కన్యాకుమారి నగరం లోని ఫ్లై వుడ్ కంపెనీ  లో అమర్చిన సీసీ కెమెరాలు ఒక కోతి దొంగలించింది అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం అక్కడ సిసి ఫుటేజీలో నమోదయింది. అయితే ఇది చూసిన యజమాని ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. అయితే వరుసగా సీసీ కెమెరాలు మాయం అవుతుండడంతో షాక్ అయిన యజమాని నిందితున్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. సీసీ కెమెరాల్లో అసలు దొంగ కోతి అన్న విషయం తెలిసి షాక్ అయ్యాడు సదర వ్యక్తి. ఏకంగా 13 సీసీ కెమెరాలు చోరీ చేసింది కోతి. ఈ వీడియో వైరల్ గా మారింది.. ఇక ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: