వైరల్ : పాఠాలు వింటూ సుఖంగా నిద్రపోతున్న బాలుడు?

Purushottham Vinay
మన చిన్నతనంలో మనం చేసే సరదాలు ఇంకా అల్లరి మనల్ని ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటాయి. అందుకనే బాల్యం ప్రతి ఒక్కరికీ కూడా చాలా విలువైనది. ఇల్లు లేదా పాఠశాల ఏదైనా, పిల్లలు ప్రతిచోటా మనం మన అల్లరిని వీలైనప్పుడల్లా జ్ఞాపకాలుగా నెమరువేసుకుంటూ ఉంటాం. మనం మన బాల్యాన్ని గుర్తు చేసుకుంటే.. ఖచ్చితంగా పాఠశాలలో కూర్చుని పాఠాలు వినే సమయంలో నిద్ర రావడం ఇంకా తరచుగా నిద్రపోయిన సందర్భం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. అలా నిద్రపోయి టీచర్ తో దెబ్బలు తిన్న సంఘటనలు కూడా మంచి జ్ఞాపకాలుగా ఉంటాయి. ప్రస్తుతం ఓ బాల్యానికి సంబంధించిన పిల్లల వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది.ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఖచ్చితంగా మీ బాల్యం గుర్తుకు వస్తుంది.ఇది చూసిన వెంటనే మీ ముఖంపై చిరునవ్వు కదలాడుతుంది.ఇక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక చిన్న పిల్లవాడు క్లాస్‌లో కూర్చొని కునుకు తీస్తుండగా, మిగిలిన పిల్లలు అయితే బిగ్గరగా చదువుతున్నారు. 


చాలా మంది పిల్లలు కూడా తమ క్లాస్ రూమ్ లో కూర్చుని.. తమ టీచర్ చెబుతున్న 'ఎ ఫర్ యాపిల్ , బి ఫర్ బాల్' ని వల్లెవేస్తున్నారు. టీచర్ చెబుతున్న పాఠాలను స్టూడెంట్స్ అనుసరిస్తూ బిగ్గరగా అరుస్తున్నారు. అయితే ఈ పాఠాలేమి నాకు సంబంధం లేదు అన్నట్లు.. తరగతి గతిలో ఒక పిల్లవాడు నిద్రపోవడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. టీచర్ చెబుతున్న పాఠం తనకు అమ్మపాడిన లాలి పాట అనుకున్నాడేమో ఆ చిన్నారి బాలుడు చాలా హ్యాపీగా సుఖంగా కునుకు తీస్తున్నాడు. అలా నిద్రపోతూ ఆ బుజ్జి బాలుడు ఉగిపోతూనే ఉన్నాడు. చాలా సార్లు అలా నిద్రపోతూ పడిపోకుండా తప్పించుకున్నాడు. ఇక ఈ వైరల్ వీడియో చివరలో స్టూడెంట్ నిద్రపోతున్నప్పుడు వెనుకకు జరిగి.. ఇక అక్కడ పడిపోయాడు. బాలుడు నిద్ర పోవడం కోసం పడిన తిప్పలు ఎవరో మొబైల్ కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: