జుట్లు పట్టుకొని పిచ్చి కుక్కల్లా కొట్టుకున్న లేడీ లాయర్లు?

Purushottham Vinay
ప్రస్తుతం సమాజంలో చాలా చిన్న విషయాలకే ఒకరినొకరు దూషించుకోవడం ఇంకా కొట్టుకోవడం అనేది చాలా  సర్వసాధారణంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుతం మనుషులకు సహనం చాలా తక్కువ అయింది. తమ ఆలోచనలు వ్యతిరేకంగా చిన్న విషయం జరిగినా కూడా తట్టుకోలేకపోతున్నారు.చదువుకున్న వాళ్ళు కూడా తిక్కగా ప్రవర్తిస్తున్నారు. బాగా గొడవలు పడుతున్నారు. ఒకొక్కసారి కోపం హద్దులు దాటి.. ఒకరితో ఒకరు కొట్టుకోవడం వరకూ వెళ్తున్నారు. అనవసరంగా గొడవలు పెట్టుకోవడమే కాదు.. ఒక్కోసారి ఒకరి ప్రాణం తీసే వరకూ వెళ్తున్నారు కూడా. ఇలా జరగడానికి కారణం.. అదుపులేని కోపం కారణం అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఇద్దరు లాయర్లు.. కోర్టు ఆవరణలోనే జట్లు పట్టుకొని మరి కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా వీళ్ళేంట్రా బాబు అని నవ్వుతారు కూడా.నిజానికి, ఈ వీడియోలో, ఇద్దరు మహిళా లాయర్లు ఏదో ఒక విషయంపై ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. వారి మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. 


హద్దులు దాటిన కోపంతో ఇద్దరు లాయర్లు ఒకరి జుట్టుని మరొకరు పట్టుకుని.. కొట్టుకున్నారు. అంతేకాదు.. ఇద్దరూ చెంపదెబ్బల వర్షం కూడా కురిపించుకున్నారు. వీడియోలో ఒక మహిళా న్యాయవాది నేల మీద నుంచి లేచి.. వెంటనే మరో మహిళా లాయర్‌తో గొడవపడుతుంది. అవతలి మహిళ లాయర్ కూడా తనకు ఏమీ తక్కువ కాదన్నట్లు.. కొట్లాటకు దిగింది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చెంపదెబ్బలు కొట్టుకున్నారు. చివరికి ఒక లేడీ పోలీస్ జోక్యం చేసుకుని ఇరువురు లాయర్లను విడిపించింది. ఆ సమయంలో కోర్టు ఆవరణలో ఇంకా చాలా మంది ఉన్నారు. మరో హైలెట్ ఏంటంటే ఇద్దరు స్త్రీలు గొడవ పడుతుంటే వినోదం చూస్తున్నారు కానీ ఇద్దరినీ విడిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ప్రస్తుతం వున్న చెత్త ట్రెండ్ ని బాగా ఫాలో అవుతూ కొంత మంది మహానుభావులు అయితే ఈ గొడవను వారి మొబైల్‌లలో వీడియో తీసే పనిలో పాపం ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: