వైరల్ : చిన్నపిల్లాడిలా మారిన భారీ ఏనుగు.. ఏం చేస్తుందో చూడండి?

praveen
సాధారణం గా అడవుల్లో ఉండే భయంకరమైన జంతువులలో ఏనుగులు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే  భారీ ఆకారం కలిగి ఉండే ఏనుగులు అంతే బలాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే ఏనుగులను చూస్తే అడవుల్లో ఉండే అన్ని జంతువులు కూడా భయం తో వనికి పోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక అటు ఏనుగులు కొన్ని కొన్ని సార్లు అడవుల నుంచి జనాభాసాల్లోకి వస్తూ పంటలను నాశనం చేయడం  ఎంతో మంది జనాలపై దాడులకు పాల్పడటం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి.
 అయితే ఏనుగులకు కోపం వస్తే ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో అన్నదానికి సంబంధించి ఇప్పటివరకు సోషల్ మీడియా లో ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారి పోయాయి అని చెప్పాలి. తన ముందు ఏముంది అన్న విషయాన్ని పట్టించుకోకుండా దారుణం గా ధ్వంసం చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. అదే సమయం లో ఏనుగు ఆనందం గా ఉన్నప్పుడు ఎంతో చిలిపి పనులు చేస్తుంది అన్న దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు వరకు చాలానే వెలుగు లోకి వచ్చాయి.

 ఇక భారీ ఆకారం ఉండే ఏనుగులు చేసే చిలిపి పనులు కొన్ని కొన్ని సార్లు మనసును పరవశించేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇక్కడ ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది. అస్సాం లోని గౌహతి లో ఉన్న నారంగి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతం లో చిల్డ్రన్స్ పార్క్ లోకి వచ్చింది ఒక భారీ ఏనుగు. సాధారణం గా ఇలా భారీ ఏనుగు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఏనుగు మాత్రం చిన్నపిల్లాడి మాదిరిగానే అక్కడున్న వస్తువులతో బాగా ఎంజాయ్ చేస్తుంది. పార్కులో కట్టి ఉన్న రబ్బరు టైర్లతో ఆడుకుంటూ సందడి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: