ఓరి నాయనో ఇదేం ఆచారం..పాము కాటు పడాల్సిందే..

Satvika
సైన్స్ జెట్ స్పీడుగా ముందుకు వెళుతున్న.. మూఢ నమ్మకాలు కూడా అంతే వేగంగా వ్యాపిస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల లో భయాందోళనకు గురి చేసే వింత ఆచారాలు ఉన్నాయి..వాటిని తప్పక పాటిస్తేనే కోరుకున్న కోరికలు తీరతాయని వారి నమ్మకం. అందుకోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ మొక్కులను చెల్లిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాము.. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల ప్రజలు తమ ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకోవడానికి వారి సొంత సంపద్రాయాలను పాటిస్తారు.

ఈ మేరకు జార్ఖండ్‌లో మానస దేవిని పూజించే సమయం లో భక్తులు తమ విశ్వాసాన్ని ప్రత్యేకమైన సంప్రదాయంతో వ్యక్తపరుస్తారు. మానస దేవి పూజ సమయంలో భక్తులు చాలా విషపూరితమైన పాములను పట్టుకుని నృత్యం చేస్తారు. వారితో రకరకాల విన్యాసాలు చేస్తారు. ఈ క్రమంలో పలుమార్లు విషసర్పం కూడా భక్తులను కాటేస్తుంది. పూజ సమయంలో అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన పాములు కూడా స్నేహితులవుతాయని నమ్ముతారు. ఈ సమయంలో భక్తులే కాకుండా విషసర్పాలు కూడా మానస దేవి భక్తి లో మునిగి నాట్యం చేస్తాయి.

అంతేకాదు ప్రజలు తమ మెడలో కొండచిలువ, నాగుపాము వంటి విష సర్పాలను ధరించి తిరుగుతారు. వారు వాటిని నోటితో నొక్కుతారు, తమని తాము కరిపించుకుంటారు. ఈ సమయంలో మనసాదేవి అనుగ్రహంతో పాముల లోని విషం తమకి హాని చేయదని వాళ్ళు గట్టిగా నమ్ముతారు.. పూజలు పూర్తయిన తర్వాత పట్టుకున్న విషసర్పాల ను అడవుల్లో విడిచిపెడతారు. ప్రతి సంవత్సరం ఈ పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఉంటుందని.. తమ గ్రామస్థుల ను పాము కరవవని నమ్మకం. మానస పూజ సమయం లో వ్రతాలు చేసే భక్తుల కోరికలు ఎల్లప్పుడూ నెరవేరతాయని నమ్మకం. మానసాదేవి దేవాలయాల్లో తాంత్రిక సాధన, సవర మంత్రాలు ఆచరిస్తారు. ఒక నెల పాటు నిరంతరం పూజిస్తారు.. దేవుడా ఇలాంటి వింత ఆచారాలు మనకు అయితే లేవు..బ్రతికిపోయాము..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: