రియల్ బాహుబలి.. ఎంత బరువు మోసాడో చూడండి?

praveen
సాధారణం గా ఇటీవల కాలం లో ఎవరైనా ఎక్కువ బరువులు ఎత్తారు అంటే చాలు వారిని బాహుబలి అంటూ పిలవడం మొదలు పెడుతూ ఉన్నారు నెటిజన్లు.  ఎందుకంటే బాహుబలి సినిమాలో ఎంతో బరువైన శివలింగాన్ని అలవోకగా ఎత్తుకుంటాడు ప్రభాస్. ఇక ఇది ఎంత సెన్సేషన్ గా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమా వచ్చినప్పటినుంచి బరువులు ఎత్తే ప్రతి ఒక్కరిని బాహుబలి అనడం ఒక ట్రెండ్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో రియల్ లైఫ్ బాహుబలిలు ఎంతో మంది కనిపిస్తున్నారు అని చెప్పాలి.

 అలా జరగడం అసాధ్యం అని అందరూ అనుకుంటూ ఉంటే.. వాళ్లు మాత్రం అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతో అలవోకగా ఎవరు మోయలేనంత బరువు ను మోసేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. సోషల్ మీడియా కారణంగా ఇలాంటి వీడియోలు ఎన్నో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్లో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇక్కడ వీడియోలో చూసుకుంటే 50 కేజీల బరువు ఉన్న మూడు యూరియా బస్తాలను ఎంతో అవలీలగా మోసాడు యువకుడు.

 నేటి రోజుల్లో 20 కిలోల బస్తా మోయాలి అంటేనే ఎంతో మంది ఆపసోపాలు పడుతూ ఉంటారు. కానీ వరంగల్ జిల్లాకు చెందిన ఒక యువకుడు మాత్రం 50 కేజీల బరువు ఉన్న మూడు యూరియా బస్తాలను  తలపై పెట్టుకుని ఎంతో అవలీలగా మోసాడు. అదికూడా పొలం గట్లపై నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు అనే చెప్పాలి.  వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయ పహాడ్ గ్రామ శివారు చంద్రు తండా కు చెందిన నారావత్ అనిల్ ఇలా సోషల్ మీడియాలో రియల్ బాహుబలి అంటూ పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: