సైకిల్ స్టంట్ చేయాలనుకున్నాడు.. కానీ ఏం జరిగిందో చూడండి?

praveen
ఇటీవల కాలంలో ఎంతో మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు రిస్కీ స్టంట్స్ చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. ఇక అందరికంటే భిన్నంగా ఏదో ఒకటి చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం చేస్తున్నారు. ఇలా కొత్తగా ట్రై చేయడం ద్వారా తక్కువ సమయంలోనే పాపులారిటీ వస్తుందని భావిస్తున్నారు. కానీ ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చేసే రిస్కీ స్టంట్స్ కొన్నిసార్లు ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటాయి.

 ఎంతోమంది ప్రాణాల మీదకు రావడం.. ఇంకా ఎంతో మందిని ఆస్పత్రి పాలు చేయడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.. ఇక ఇలాంటి తరహా వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడ ఓ యువకుడు అద్భుతమైన సైకిల్ స్టంట్ చేసి నెటిజన్లు అందరిని కూడా వావ్ అని అనేలా చేయాలి అని అనుకున్నాడు. కానీ ఆ వీడియో చూసి మాత్రం నెటిజన్లు అందరూ కూడా అయ్యో పాపం అని అనుకుంటున్నారు.ఎందుకు అంటారా.. అతడు చేయాలనుకున్న సైకిల్ స్టంట్ కాస్త చివరికి ప్రమాదానికి కారణమైంది.

 ఇక ఈ వీడియో చూసిన తర్వాత తిక్క కుదిరింది అని కొంతమంది నెటిజన్లు అనుకుంటూ ఉంటే.. పాపం అతనికి ఎన్ని గాయాలు అయ్యాయో అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో లో ఏముంది అని అనుకుంటున్నారు కదా.. ఒక వ్యక్తి రోడ్డుపై పడుకున్నాడు. దూరం నుంచి మరో వ్యక్తి సైకిల్ తొక్కుతూ వేగంగా వచ్చాడు. అయితే ఇలా రోడ్డుపై పడుకున్న వ్యక్తి పైనుంచి సైకిల్ జంప్ చేయించాలని ప్రయత్నించాడు సదరు వ్యక్తి. కానీ స్పీడ్ గా వచ్చిన సైకిల్ పడుకున్న వ్యక్తిని ఢీ కొట్టింది. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: