దేవుడా..ఇలా తింటే ఏ రికార్డులనైనా బ్రేక్ చెయ్యొచ్చు..

Satvika
భోజన ప్రియుల నోటికి అదుపు ఉండదు..చేతికి తీరిక ఉండదు అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ మధ్య ఫుడ్ ఛాలెంజ్ వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. ఇప్పుడు మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తిండి కోసమే బ్రతుకు తున్నాము అనేలా కొందరు భోజన ప్రియులు లాగించేస్తారు..వారి తిండికి అదుపు ఉండదు..మంచి రుచికరమైన భోజనం కోసం ఎక్కడైనా వెలతారు.రుచికరమైన వంటకాలను తినడం కోసం ప్రపంచాన్ని చేట్టేస్తారు. అదే సమయంలో ఆహారాన్ని తినే దానికంటే ఎక్కువగా తిని గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు.

ఈ వ్యక్తులు సాధారణ వ్యక్తి కంటే చాలా ఎక్కువ ఆహారం తీసుకుంటారు. భోజన ప్రియులకు ఆహారం పట్ల మక్కువ వేరే స్థాయిలో ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఆహారం తిని.. సరికొత్త కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన వారు చాలామంది ఉన్నారు..తాజాగా బ్రిటన్ కు చెందిన ఓ యూట్యూబర్ తినడంలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. యూట్యూబర్ లియా బ్రేక్‌ఫాస్ట్ తింటూ సరికొత్త రికార్డు సృష్టించింది..

వేగంగా ఆహారాన్ని తినే విషయంలో ఇప్పటివరకు 27 ప్రపంచ రికార్డులను సృష్టించింది. తాజాగా దేశంలోనే అతిపెద్ద బ్రేక్‌ఫాస్ట్ ఛాలెంజ్‌ని పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. లియా కేవలం 8 నిమిషాల్లో 8 వేల కేలరీల బ్రేక్‌ఫాస్ట్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది..తను  తీసుకున్న ఛాలెంజ్‌లో ఐదు గుడ్లు, ఐదు సాసేజ్‌లు, ఐదు బేకన్, ఐదు టమోటాలు, ఐదు హాష్ బ్రౌన్స్ లతో పాటు ఐదు కప్పుల బ్లాక్ పుడ్డింగ్ ఉన్నాయి, అదనంగా ఐదు టోస్ట్‌లు, ఐదు గిన్నెల బీన్స్ , ఐదు బౌల్స్ పుట్టగొడుగులు. ఈ బ్రేక్ ఫాస్ట్ పూర్తి కేలరీలను లెక్కిస్తే.. లియా కేవలం 8 నిమిషాల్లో మొత్తం 8 వేల కేలరీలు తిని తన బ్రేక్ ఫాస్ట్ ని పూర్తీ చేసింది..అంత ఫుడ్ ను మనం అయితే తినలేము.. మొత్తానికి ఆ బిగ్ ఛాలెంజ్ ను పూర్తీ చేసి బకాసురుడి చెల్లెలు అనిపించింది.. మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి.. ఆ వీడియో పోస్ట్ అయిన కొద్ది నిమిషాలకే లక్షల వ్యుస్ ను సొంతం చేసుకుంది.మీరు ఒకసారి ఆ వీడియోపై కామెంట్ వేసుకొండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: