సోలార్ కార్: పెట్రోల్ ఖర్చు, ఛార్జింగ్ అసలు అవసరమే లేదు!

Purushottham Vinay
ఇక దేశంలో రోజు రోజుకూ కూడా పెరుగుతునన పెట్రోల్ డీజిల్ ధరలు(Petrol diesel Cost) సామాన్యుడికి భారంగా మారాయి. దీంతో చాలా మంది బైకులు ఇంకా అలాగే కార్లను బయటకు తీయాలంటేనే చాలా భయపడుతున్నారు.ఇక కొందరు అయితే ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొందామంటే ఇక అవి ఎక్కడ పేలిపోతాయో అని భయం. ఈ క్రమంలోనే కాశ్మీర్‌కు చెందిన ఓ టీచర్ మంచి అద్భుతాన్ని ఆవిష్కరించారు.కాశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా సౌరశక్తితో నడిచే కారును తయారు చేశారు. శ్రీనగర్‌లోని సనత్ నగర్‌కు చెందిన బిలాల్ అహ్మద్ పదకొండేళ్లు ఎంతో శ్రమపడి తన కలల కారును సృష్టించారు. ఇక ఈ లెక్కల మాస్టారుకి కార్లంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే వాటి తయారీ విధానంపై అధ్యయం చేసి చివరకు సోలార్ కారును ఆయన తయారు చేశారు. కారు బ్యానెట్, కిటికీలు ఇంకా అలాగే వెనక అద్దంపై సోలార్ ప్యానెళ్లను అమర్చారు బిలాల్ అహ్మద్. ఇక ఆ కారు డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా దాని డోర్స్ కూడా చాలా డిఫెంరెంట్‌గా ఉన్నాయి. ఇక అంతేకాదు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా దానికి అమర్చారు. ఈ కారుకు ఎలాంటి పెట్రోల్ ఇంకా అలాగే డీజిల్ అనేది అవసరం లేదు. చార్జింగ్ పెట్టాల్సిన పని అసలు అంతకన్నా కూడా లేదు.


కేవలం సూర్యరశ్మి ఉంటే చాలు.. ఎక్కడికైనా.. ఎంత దూరమైనా కానీ అసలు పైసా ఖర్చు అనేదే లేకుండా చాలా ఈజీగా వెళ్లవచ్చు.ఇక బిలాల్ తయారు చేసిన ఈ సోలార్ కారు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తోంది. కాశ్మీర్ లోయలో ఇదే తొలి సోలార్ కారు అని నెటిజన్లు కూడా ఆయన్ని చాలా మెచ్చుకుంటున్నారు. అసలు పైసా ఖర్చు లేకుండా నడిచే కారును తయారు చేసినందుకు గాను ఆయనపై వారు ప్రశంసల జల్లు కురుస్తోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఆయన్ను ఎంతగానో అభినందించారు.స్టైల్‌ని ఇంకా అలాగే ఇన్నోవేషన్‌ను మిక్స్ చేసి, ఒక దశాబ్దానికి పైగా ప్రాజెక్ట్‌లో పనిచేసిన అహ్మద్ దీనిని సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే వెర్షన్‌గా కూడా మార్చాలనుకుంటున్నారు. ఇక ఈ కారు అయితే ఆన్‌లైన్‌లో చాలా మంది ఆసక్తిని రేకెత్తించింది, ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ ఔత్సాహికులు ఎలోన్ మస్క్ టెస్లా ఆపరేషన్‌ను కూడా భారతదేశంలో ప్రారంభించాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: