వీడి పోజులకు షాక్ ఇచ్చిన పోలీసులు.. వామ్మో..

Satvika
సినిమాలను చూసి యువత చెడిపోతున్నారు..ఫైట్స్, డైలాగులు, డ్యాన్స్ లాంటివి చెస్తున్నారు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారూ..వాటికి వస్తున్న లైకులు, కామెంట్లతో తెగ ఫెమస్ అవుతున్నారు.. అవి కొంత వరకూ మాత్రమే బాగుంటుందని పోలీసులు ఎన్ని సార్లు చెప్పిన కొందరు యువకులు మాత్రం వినడం లేదు.. తాజాగా ఓ యువకుడు సినిమాల్లో లాగా కొన్ని సీన్లు చేసి ఫెమస్ అయ్యాడు.కానీ అంతలోనే పోలీసులు షాక్ ఇచ్చారు.

 
వివరాల్లొకి వెళితే.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్‌ తన మొదటి చిత్రం 'పూల్ ఔర్ కాంటే' లో ఒక స్టంట్ చేశాడు. రెండు కార్లపై రెండు కాళ్లుపెట్టి, నిలబడి వెళ్లే సన్నివేశం అది. ఇటీవల విడుదలైన 'గోల్‌మాల్-3'లో కూడా అదే స్టంట్ రిపీట్ చేశారాయన. అయితే, అదే స్టంట్‌ను నోయిడా లోని సొరాకా అనే గ్రామానికి చెందిన రాజీవ్ అనే యువకుడు కూడా ట్రై చేశాడు. రెండు ఎస్‌యూవీలు కదులుతుండగా, రాజీవ్ వాటిపై కాళ్లు పెట్టి నిలుచున్నాడు. సోషల్ మీడియా లో పోస్ట్ చేసే ఉద్దేశం తో ఈ వీడియో తీయించుకున్నాడు. తర్వాత దీన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసు అధికారులు యువకుడిపై కేసు నమోదు చేశారు.

 
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాలతో రోడ్డుపై న్యూసెన్స్‌కు పాల్పడ్డాడని, ఇలాంటివి చేయడం చట్ట రీత్యా నేరమని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. వీడియోలో కనిపించిన రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో కోసం అతడు రెండు టొయోటా ఫార్చ్యూనర్ వాహనాల్ని వినియోగించాడు. అందులో ఒకటి వాళ్ల సొంత వాహనం కాగా, మరొకటి స్నేహితుడిది. ప్రస్తుతం ఈ రెండింటినీ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు..మొత్తానికి పోలీసులు భలే ఝలక్ ఇచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: