దేవుడా..ఇది పెళ్లి కార్డా లేక పుస్తకమా?

Satvika
పెళ్ళిళ్ళు ఇప్పుడు కాస్త వెరైటీగా ఉంటున్నాయి.. జీవితంలో ఒకసారి జరిగే కార్యం కావడంతో చాలా మంది గొప్పగా ఆలోచిస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. పెళ్ళికి వచ్చే జనాలను ఆకట్టుకోవడం కోసం క్రియెటివ్ గా ఆలొచిస్తున్నారు..మండపం నుంచి భోజనాల వరకు ప్రతి ఒక్కటీ విభిన్నంగా ఉండాలని అనుకుంటూన్నారు.కేవలం పెళ్ళి మాత్రమే కాదు. పెళ్ళి  కోసం ఆహ్వానించే పత్రికలను కూడా కొత్తగా డిజైన్ చేయిస్తున్నారు..అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఓ వ్యక్తి తన కుమారుడి పెళ్లి పత్రికను చదివి పక్కన పడేయకుండా ఉండేందుకు దానిని కొద్దిగా మార్చారు. పుస్తకం రూపంలో తయారు చేయించి విద్యార్థులు వాడుకునేలా రూపొందించారు. ప్రస్తుతం ఈ పెళ్లి పుస్తకం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.


వివరాల్లొకి వెళితే.. ఈ వింత ఘటన ఎక్కడో కాదు మన ఏపీలోనే వెలుగు చూసింది.అనకాపల్లి జిల్లా మునగపాక మండలం మునగపాక గ్రామం చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన విల్లూరి నూక నర్సింగరావు.. తన కుమారుడి పెళ్లి పత్రిక అందరిలా వృథా కాకూడదని ఆలోచించారు. శుభలేఖ ఇచ్చిన క్షణాల్లోనే పక్కన పడేసే విధంగా ఉండకూడదని గొప్ప ఐడియాను ఆలొచించాడు..కొందరికైనా ఉపయోగపడేలా డిజైన్ చేయించారు. బంధుమిత్రుల కుటుంబాలలోని పిల్లలకు ఉపయోగపడే విధంగా తెల్లని పేజీలు ఉన్న పుస్థకాన్ని తయారు చేయించాడు.


80 పేజీల తెల్ల కాగితాల నోట్ బుక్ ను రెండువైపులా అట్టలపై పెళ్లి కార్డు ను వచ్చేలా డిజైన్ చేయించాడు. అంతేకాదు..పుస్తకానికి ముందుభాగం, వెనక భాగంలో ఆహ్వాన పత్రిక ముద్రించి మధ్య భాగమంతా తెల్లని కాగితాలు ఏర్పాటు చేశారు. ఈ పెళ్లిపత్రిక అందుకున్న వారంతా దాన్ని పక్కన పడేయకుండా వారికి ముఖ్యమైన విషయాలు రాసుకునే పుస్తకంలాగా ఉపయోగించుకోవాలని కోరారు. అంతేకాకుండా పెళ్ళి మండపం ను సులువుగా కనిపెట్టడం కోసం క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేశాడు..అతడికీ ఇలాంటి ఆలోచన రావడం పై ఆ ప్రాంతంలొని వాళ్లంతా కూడా అభినందించారు.. ఇప్పుడీ పెళ్ళి పుస్తకం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: