నెట్టింట వైరల్ అవుతున్న ఐస్ క్రీమ్ ఇడ్లీ!

Purushottham Vinay
ఇక సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఎన్నో రకాల వంటకాలు అనేవి తెగ వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వింత వంటలు అనేవి ఉంటాయి. ఇక ఈ వంటకాలని చూసి.. ఆహార ప్రియులే తెగ నివ్వెరపోతుంటారు.చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి ఇంకా అలాగే వెజ్ ఫిష్ ఫ్రై, పచ్చి మిర్చి హల్వా ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో రకాల వంటకాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ తెగ హల్‌ చల్ చేశాయి.ఇక ఈ వెరైటీ వంటలను చూసి నెటిజన్లు నోరెళ్లబెట్టడంతో పాటు ఇంకా దుమ్మెత్తిపోశారు కూడా. ఇక ఈ క్రమంలో మరో సరికొత్త వంటకం అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా ట్రెండ్ (Trending) అవుతోంది.. ఇక అదేంటంటే.. ఇడ్లీ ఐస్ క్రీం (Idli Ice-Cream) అని చెప్పాలి. ఇడ్లీ, చట్నీ ఇంకా అలాగే ఐస్ క్రీం లను మూడూ కూడా మిక్స్ చేసి రూపొందించిన వంటకం వీడియో చూసి నెటిజన్లు (Netizens) ఇదెక్కడి ఐస్‌క్రీం రా బాబు అంటూ అదిరిపోయే షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఇక సాధారణంగా.. ఐస్‌క్రీం అనగానే అందరికీ కూడా బాగా నోరూరుతుంది.


ఇక చాలామంది కూడా ఐస్‌క్రీం తినకుండా అస్సలు ఉండలేరు. అయితే.. అలాంటి ఐస్‌క్రీంతో ప్రయోగాన్ని చూసిన నెటిజన్లు తెగ షాకవుతున్నారు.ఇక వైరల్ అవుతున్న వీడియోలో ఇడ్లీని కట్ చేసి మెత్తగా చేయడాన్ని చూడవచ్చు.అలాగే దానిపై పల్లీ ఇంకా అలాగే టమాట చట్నీ వేసి..ఆ రెండు మిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఐస్‌క్రీం వేసి వాటిని మిక్స్ చేస్తాడు. దానిపై సాంబర్ ఇంకా ఐస్ క్రీం వేసి మిక్స్ చేసి.. తీయాడాన్ని మనం చూడవచ్చు. ఇక ఆపై దాన్ని తీసి కప్‌లో వేసి.. దానిపై కొంచెం ఇడ్లీ ముక్కని కూడా పెట్టి దానిపై చట్నీ వేసి సర్వ్ చేస్తాడు. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోను చూసి మీ అభిప్రాయం తెలియజేయండి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది.ఇక ఈ వైరల్ వీడియోను Kaptan Hindustan అనే యూజర్ షేర్ చేయగా ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇదేం ఐస్‌క్రీం.. చూస్తుంటేనే అదోలా ఉందంటూ కామెంట్స్ లో పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: