రూపాయికే ఇడ్లీ, మైసూర్ బజ్జీ.. ఎక్కడో తెలుసా?

Satvika
పెరుగుతున్న నిత్యావసర వస్తువులు వల్ల ఏదైనా తినాలన్నా మనుషులకు గుండెల్లో భయం పుడుతుంది.. టిఫిన్ చేయాలనీ అనుకున్న ధరల మోత మొగిపోతుంది. ముఖ్యంగా నూనె ధరలు ఆకాశానికి అంటిన విషయం తెలిసిందే. దాంతో ఫుడ్ సగానికి సగం పెరిగి పోయింది. ఇలాంటి సమయంలో రూపాయికే ఇడ్లీ, మైసూర్ బజ్జీ అందిస్తున్నారు. అంటే జనం ఆగుతారా.. అసలు ఉంటారా.. ఇది నమ్మ షక్యంగా లేదు కదూ..అయిన అది నిజం...ఓ మహిళ అతి తక్కువ ధరకే టిఫిన్ అమ్ముథూ అందరి ఆకలిని తీర్చుతుంది.

 
వివరాల్లొకి వెళితే..10 రూపాయలకే 10 ఇడ్లీలు, 10 రూపాయలకే 10 మైసూర్ బోండాలు, 10 రూపాయలకే రెండు పూరీలు.. వావ్ ఇన్ని ఐటమ్స్ ఎక్కడ పెడుతున్నారు అని ఆలోచిస్తున్నారు కదా.. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం రాయభూపాల కొత్తూరు గ్రామం లో వుంది. ఇంత తక్కువకు అంటే ఎలా వుంటుందో అనుకోకండి.. చాలా టేస్ట్ గా రుచికరమైన భోజనం ను అందిస్తున్నారు.. నిజంగా ఇది చాలా గ్రేట్ అని చెప్పాలి..


లీటర్ ఆయిల్ ప్యాకెట్ దాదాపు 180 రూపాయలకు పైనే ఉంది. పల్లీలు, గోదుమ పండి, మినపప్పు సహా ఇతర నిత్యావసర ధరలన్నీ ప్రస్తుతం మండిపోతున్నాయి.. ఇలాంటి సమయంలో ఇలా ముందుకు రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మూడు రకాల చట్ని లు కూడా ఉండటం విశేషం.. పిల్లల కోసం మాత్రమే ఈ డబ్బులు కూడా తీసుకుంటూన్నారని వాళ్ళు చెబుతున్నారు.ఒక్క రూపాయికే ఇడ్లీని గత 16 సంవత్సరాలు గా ప్రజలకు అందిస్తూ ఆదర్శ దంపతులు గా నిలుస్తున్నారు. నిజంగా వాళ్ళు చేస్తున్నా ఆలోచన అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి..నమ్మి తన హోటల్‌కు వచ్చిన కస్టమర్స్‌కు రుచి, శుచికరమైన, వేడివేడిగా అల్పాహారాన్ని అందివ్వడమే ఒక దివ్యానుభూతిగా భావిస్తున్నామని వాల్లు అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: