యువకుడిని పట్టాల మీద నుంచి తోసేసిన పోలీస్.. కారణం..!

MOHAN BABU
 తానే జిల్లాలోని ఒక యువకుడు వెంట్రుకవాసిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. అతనికి ఏం ఇబ్బంది వచ్చిందో ఏమో కానీ ఎదురుగా వస్తున్నటువంటి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందామనుకున్న. రైలు వచ్చే వరకు ప్లాట్ ఫామ్ మీద ఎదురుచూశాడు. రైలు వచ్చిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పట్టాలపై  దూకేశాడు. దీంతో చుట్టుపక్కల చూసినవాళ్లంతా ఏదైనా సీటు కోసం దూకాడో ఏమో అని భావించారు కానీ పట్టాల మీద పడుకో బోతుంటే అందరూ అవాక్కయ్యారు. ఇది రైలు రావడానికి కొన్ని సెకన్లు ముందే జరిగింది. దీంతో ఆ యువకుడిని దూరం నుంచి గమనించినటువంటి ఆర్ పి ఎఫ్ పోలీస్ అతని ప్రాణాలను కాపాడాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారింది. అప్పుడప్పుడు ఇలాంటి రకరకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయానకంగా ఉంటాయి. కొన్నిసార్లయితే ఊహించని షాక్ కూడా తగులుతుంటాయి. అయితే ఈ వీడియోలు చూడడానికి నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

మహారాష్ట్రలోని తానే జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విట్టల్ వాడి రైల్వేస్టేషన్లో పసుపు కలర్ చొక్కా, బ్లూ కలర్ పాయింట్ వేసుకున్నటువంటి యువకుడు ప్లాట్ఫారం మీదకు వచ్చి కూర్చున్నాడు. దీంతో అతని కదలికలను అనుమానంగా ఉన్నట్టు అక్కడే ఉన్న పోలీసులు కనిపెట్టాడు. ఇంతలో రైల్ స్టేషన్ కు వస్తున్నది. వెంటనే ఆ యువకుడు ప్లాట్ఫారం మీద నుంచి  ఎదురుగా వస్తున్నటువంటి రైలు ముందు  దూకాడు. వెంటనే పడుకోబోయాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ధైర్యసాహసాలతో అమాంతం పట్టాలపైకి దూకి క్షణకాలంలో బయటకి తోసేశాడు. దీంతో అతను సురక్షితంగా బయటపడ్డాడు. అయితే పోలీస్ అధికారి ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ యువకుడు బతికే వాడు కాదు. దీంతో ఈ తతంగమంతా అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలో రికార్డ్ అయింది. వెంటనే ఈ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దీంతో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ధైర్యసాహసాలకు పదవులు నెటిజన్లు అభినందనలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: