గుర్రాన్ని కొన్న వ్యక్తి.. ఎందుకు అని అడిగితే షాకింగ్ సమాధానం?

praveen
సాధారణంగా ఎవరైనా గుర్రపు స్వారీ చేయడం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ముచ్చటేస్తూ ఉంటుంది. నేను కూడా ఒకసారి అలా గుర్రపుస్వారీ చేస్తే ఎంత బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ గుర్రపు స్వారీ చేయడం అంటే అంత సులభం కాదు కదా. దాని కోసం కొంత ప్రత్యేకమైన శిక్షణ తీసుకొని ఉండాలి. లేదంటే ప్రమాదం బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అది సరే ఇప్పుడు గుర్రపుస్వారీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్. ఇటీవలే ఒక వ్యక్తి గుర్రాన్ని కొనుగోలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. గుర్రాలను ఎంతోమంది కొంటారు అమ్ముతూ ఉంటారు. అందులో కొత్తగా ఏముంది అని అంటారా. గుర్రాన్ని కొనడం కొత్త కాదు కానీ అతను చెప్పిన కారణం మాత్రం చాలా కొత్తగానే ఉంది.

 అందుకే గుర్రం కొనుగోలు చేసిన సదరు వ్యక్తి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇటీవల కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతలా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో సామాన్య ప్రజలు వాహనం బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెట్రోల్ ధరల బారి నుంచి తప్పించుకునేందుకు ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేయడం లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో సరికొత్త ఆలోచన చేశాడు. అందరిలా కాకుండా కాస్త కొత్తగా ఆలోచించి గుర్రాన్ని కొనుగోలు చేశాడు.

 మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన షేక్ యూసుఫ్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా తో చెప్పాడు. నేను కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఉన్నాను.. ఇక ప్రతి రోజూ కూడా నేను ప్రయాణం చేయడానికి గుర్రాన్ని ఉపయోగిస్తా.. ఇది ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇంధన ధరల పెరుగుదల దృశ్య గుర్రంపై వెళ్లడమే మంచి ఎంపిక అని నాకు అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇక రోజువారి పనుల్లో భాగంగా గుర్రాన్ని ఉపయోగిస్తున్న వీడియోలను ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ గుర్రానికి జిగర్ అనే పేరు పెట్టాడు. దీనికి 40 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలిపాడు.  ఇక ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది సోషల్ మీడియాలో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: