ట్రైన్ ఇంజిన్ లో మంటలు.. భయంతో ప్రయాణికులు ఏం చేశారంటే..?

Divya
న్యూఢిల్లీ లోని రైల్వే స్టేషన్ లో ఆగివున్న ఒక రైలు ఇంజన్ భోగిలోంచి మంటలు వ్యాపించాయి.. ఇంజన్ తో ఉన్న రెండు బోగీలకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. దీంతో ఈ మంటలు మిగిలిన రైల్వే బోగీలకు తిరిగి వ్యాపించకుండా ప్రయాణికులు అప్రమత్తమై.. అందరూ కలిసి మంటలు మండుతున్న భోగిని మిగిలిన బోగీల నుంచి వేరు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ మంటల గల భోగిను ఒక్కసారిగా అవలీలగా తోసేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని చోటుచేసుకున్నది.

సహరన్పుర్ ఢిల్లీ ప్యాసింజర్ ట్రైన్ దౌరాల రైల్వే స్టేషన్  లో ఆగివున్నది. ఇక అదే టైంలో ఢిల్లీ ప్యాసింజర్ ట్రైన్ కూడా అక్కడే ఆగింది.. ఆ ఇంజన్ లో  నుంచి మంటలు వ్యాపించడం మొదలయ్యాయి. ఇక మంటలు మరొక రెండు బోగిలకు కూడా వ్యాపించాయి. దీంతో రైల్వే స్టేషన్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి రావడం జరిగింది. దీంతో ఆ మంటలను ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ వీలు కాకపోవడంతో ఆ మంటల బోగీల నుంచి మిగిలిన భోగి లను వేరు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక సిబ్బంది రైలు భోగి లను వెనక్కి నెట్టేసే సహాయంలో ప్రయాణికులు కూడా సహాయం చేయడం జరిగింది.

ఆ తర్వాత అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది ద్వారా ఆ ప్యాసింజర్ ట్రైన్ మంటలు ఆర్పడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ  రైల్వే ట్రాఫిక్ కొద్దిసేపు అంతరాయం కలిగిందని అధికారులు తెలియజేశారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదని అధికారులు తెలియజేశారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను మాత్రం గుర్తించాల్సి ఉందని అధికారులు తెలియజేశారు. అయితే ఇటీవల కాలంలో రైల్వే బడ్జెట్ పై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగింది. వాటి గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: